ఏపీలో ప్రభుత్వ వైన్ షాపుల్లో చేపట్టిన తనిఖీలు ముగిసాయి. జిల్లా వ్యాప్తంగా 266 మద్యం దుకాణాల్లో లెక్కలు బయటకు తీశాయి ప్రత్యేక బృందాలు. సర్కిల్-4 పరిధిలోని వైన్ షాపుల్లో గోల్ మాల్ వెలుగు చుసిన విషయం తెలిసిందే. 35 లక్షల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించారు సిబ్బంది. సిఐ నాగశ్రీనివాస్ ప్రమేయం నిర్ధారణ కావడంతో అతని పై వేటు పడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్.ఐ.విమలాదేవి, ముగ్గురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఆ నాలుగు షాపుల్లో మినహా ఎక్కడా అవతకవలు లేవని అధికారులు స్పష్టం చేసారు.