మహబూబాబాద్‌లో సుపారీ గ్యాంగ్ హల్‌చల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బుల కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతున్న రోజులవి. మహబూబాబాద్ జిల్లాలో ఓ సుపారీ ముఠా హల్ చల్ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కు యత్నించిన ఆ ముఠా సభ్యులు అడ్డంగా బుక్కయ్యారు.. వారిని పట్టుకొని చితకబాదిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ కిడ్నాప్ సంఘటన మహబాబూబాద్ లోని సాలార్ తండా వద్ద జరిగింది.
రాకేశ్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన కారులో సాలార్ తండా కు బయలుదేరి వెళ్లాడు. ఈ క్రమంలో ఆరుగురు అజ్ఞాత వ్యక్తులు అక్కడికి చేరుకొని రాకేష్ రెడ్డిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. బలవంతంగా కారులో ఎక్కించుకొని ఎత్తుకెళ్ళే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్థానికులు గమనించి ఆ సుపారీ గ్యాంగ్ ను అడ్డుకున్నారు.
Also Read
సినీ ఫక్కీలో కారుకు అడ్డం తిరిగి మరీ రాకేశ్ రెడ్డిని కాపాడారు. ఆ ముఠాలోని ముగ్గురిని పట్టుకొని చితకబాదారు. వీరి దెబ్బలకు భయపడిన మరో ముగ్గురు పరారయ్యారు. అనంతరం ఆదేకారులో ఆ గ్యాంగ్‌లోని ముగ్గుర్ని మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అప్పగించారు స్థానికులు. ఐతే ఈ సుఫారీ గ్యాంగ్ ఖమ్మం జిల్లా నుండి వచ్చినట్లు గుర్తించారు. వీరిని ఎవరు పంపారు? రాకేష్ రెడ్డిని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారనేది పోలీసుల విచారణలో తేలనుంది. మొత్తం మీద ఈ సుఫారీ గ్యాంగ్ హల్ చల్‌తో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
-
Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
-
Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
-
BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!