బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు.. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.. ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317కు వ్యతిరేకంగా… కొన్ని నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్ తలపెట్టిన దీక్షను భగ్నం చేసి.. ఆయనను ఆదివారం రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కాగా.. ఇవాళ కోర్టులో హాజరు పర్చారు.. అయితే, బండి సంజయ్ కోసం ఫోన్ చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా… పోలీస్ కస్టడీలో ఉన్నారని నడ్డాకు తెలిపారు బండి సంజయ్ కార్యాలయ సిబ్బంది.. వెంటనే స్పందించిన జేపీ నడ్డా.. సంజయ్ జీకి నా మాటగా చెప్పండి.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన సంజయ్ జీ చేస్తున్న పోరాటం భేష్…. కేసుల విషయంలో ఏం వర్రీ కావొద్దు. మేం చూసుకుంటాం… న్యాయ స్థానంలో మేం పోరాడతాం… జాతీయ నాయకత్వం యావత్తు సంజయ్ జీ వెంట ఉంది. గో…హెడ్’’ అని భరోసా ఇచ్చారని బండి సంజయ్ కార్యాలయం వెల్లడించింది.
Read Also: లఖింపూర్ ఖేరి ఘటన.. సిట్ 5 వేల పేజీల చార్జ్‌షీట్