Fire Accident: నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుపతి పట్టణంలోని గోవిందరాజ స్వామి దేవాలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో... మొదట ఫోటో ఫ్రేమ్ షాపులో మంటలు చెలరేగాయి.
రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రమాదాల్లో మరణాలు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్న వారిలో ప్రమాదాల మూలంగా మరణిస్తున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోందని ఈ మధ్య నిర్వహించిన సర్వేలో తేలింది.
బయటి ప్రపంచానికి తెలియాలంటే వెంటనే గుర్తొచ్చేది సోషల్ మీడియా. అందులోనూ రీల్స్ చేస్తే బయటి ప్రపంచానికి త్వరగా తెలుస్తామని నేటి యువత రీల్స్ మోజులో పడిపోయింది.
మణిపూర్ కేబినెట్లో ఏకైక మహిళ మంత్రిగా ఉన్న నెమ్చా కిప్జెన్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఇంఫాలో ఉన్న మంత్రి అధికారిక నివాసానికి దుండగులు నిప్పంటించినట్లు ఒక అధికారి వెల్లడించారు.
సెంట్రల్ ఇంగ్లాండ్లోని నాటింగ్హమ్ వీధుల్లో ఒక దుండగుడు జరిపిన దాడిలో ముగ్గురు చనిపోయారు. వారిలో ఒకరు భారత సంతతికి చెందిన యువతి ఉన్నారు. యువతి వైద్య విద్యను అభ్యసిస్తోంది.
బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఈ సంవత్సరం జనవరిలో కనిపించకుండా పోయాడు. అయితే సదరు వ్యక్తి నోయిడాలోని మోమోస్ స్టా్ల్ లో కనిపించాడు. నిశాంత్ కుమార్ అనే వ్యక్తి చనిపోయాడని కుటుంబీకులు అనుకున్నారు. అయితే అతను.. జనవరి 31వ తన అత్తమామల ఇంటికి పెళ్లికి వెళ్తుండగా మిస్సైయ్యాడు.
మణిపూర్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా.. రాష్ట్రంలో జరిగిన అల్లర్లలో ఓ మహిళతో పాటు మరో 9 మంది మరణించారు. మణిపూర్ లోని ఓ చర్చిలో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడటంతో.. ఒక మహిళతో పాటు 10 మంది మరణించాగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్ బోయినపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పు గోదావరికి చెందిన విజయలక్ష్మీ భర్త, తన ఇద్దరు కూతుళ్లతో బోయినపల్లిలో నివసిస్తోంది. ఇటీవలే ఇంటి పెద్ద, తమ తండ్రి చనిపోయాడు. అయితే తన తండ్రి లేడన్న బాధతో అప్పటి నుంచి ఫ్యామిలీ మొత్తం డిప్రెషన్లోకి వెళ్లిపోయారు.