Hyderabad Crime: గంటల వ్యవధిలో హైదరాబాద్ లో దారుణ హత్యలు జరిగిపోయాయి. 12 గంటల లోపే ఆరుగురు హత్యకు గురయ్యారు. వివిధ ప్రాంతాల్లో వివిధ కారణాలతో.. వివిధ తీరులో హత్యలు జరిగాయి. జరిగిన హత్యలపైన పోలీసులు విచారణ ప్రారంభించారు. ట్రాన్స్ జెండర్ గా యువకుడిని మార్చే వేసేందుకు ప్రయత్నం చేయగా.. యువకుడు సూసైడ్ చేసుకోవడంతో అతని సోదరులు కలిసి ట్రాన్స్ జెండర్లను హత్య చేశారు. మరొకటి రోడ్డుపై నిద్రిస్తున్న ముగ్గురు వ్యక్తులను బండరాళ్లతో కొట్టి చంపేశారు. ప్రేమించడం లేదని పెళ్లికి నిరాకరించిందని చెప్పి యువతిపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశారు. భార్య మరొకరితో బైక్ పై వెళుతుండగా చూసిన భర్త వెంటపడి వేటాడి చంపాడు. ఇలాంటి దారుణ ఘటనలతో నగరం దద్దరిల్లిపోతుంది.
టప్పాచబుత్ర పరిధిలో జరిగిన జంట హత్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఇద్దరు ట్రాన్స్ జెండర్స్ ను నలుగురు యువకులు కలిసి అతి కిరాతకంగా కొట్టి చంపారు. పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. చాంద్రాయణ గుట్టకు చెందిన అన్వర్, అక్బర్ల సోదరులు ఆజామ్ ఇటీవల కాలంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాల పైన కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. టపాచబుత్రలో ఉంటున్న ఇద్దరు ట్రాన్స్ జెండర్స్ అజమ్ ని ఇబ్బందులు పెట్టినట్లుగా తేలింది. ఇద్దరు ట్రాన్స్ జండర్లా ఇబ్బందుల వల్లనే మృతి చెందినట్లుగా తేల్చారు. అజమ్ మృతికి కారణమైన ఇద్దరు ట్రాన్స్ జెండర్స్ పైన సోదరులు పగ పెంచుకుని.. వారిని రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ తర్వాత వారు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.
Read Also: CM YS Jagan Final Warning: ఆ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఫైనల్ వార్నింగ్.. ఇలా అయితే నో టికెట్..!
మరోవైపు మైలార్ దేవుపల్లి పరిధిలో దారుణం చోటుచేసుకుంది. దుర్గానగర్ చౌరస్తా సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యలు జరగడానికి కొన్ని గంటల ముందు అదే ప్రాంతంలో మరొకరు హత్యకు గురయ్యారు. మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంటల వ్యవధిలోనే ముగ్గురిని అతికిరాతంగా చంపివేశారు. చనిపోయిన ముగ్గురు కూడా గుర్తుతెలియని వ్యక్తులని పోలీసులు అంటున్నారు. ఈ ముగ్గురిని కూడా ఒకే తరహాలో ఒకే తీరులో చంపారని పోలీసులు చెప్పారు. అయితే ముగ్గురిని చంపడానికి గల కారణాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికైతే అక్కడ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అక్రమ సంబంధం చాదర్ ఘాట్లో ఒకరు ప్రాణం తీసింది. తన భార్య ఓ వ్యక్తి బైక్ పై వెళుతుండగా భర్త చూసి యువకుని కత్తులతో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత భర్త వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజంపురాలో జరిగింది. ఆజంపురా కట్టెలగూడాకు చెందిన సెంట్రింగ్ కార్మికుడు యూసుఫ్(30) అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో బైక్ పై వెళుతున్నాడు. విషయం తెలుసుకున్న భర్త, బంధువులు బైక్ లపై వెంబడించి దారుణంగా హత్య చేసి పారిపోయారు. మృతుడికి సదరు మహిళతో అక్రమ సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం నిందితులు పీఎస్ లో లొంగిపోయిన ట్లు తెలిసింది. ఘటనా స్థలాన్ని సౌత్ ఈస్ట్ అదనపు డిసిపి మనోహర్ క్లూస్ టీం సందర్శించి వివరాలు సేకరించారు.
Read Also: Mega Princess: మెగా ప్రిన్సెస్ జాతకం చెప్పిన వేణుస్వామి.. మెగా కుటుంబంలో వారు ఉండరట
గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న వాసవీకి గణేష్ తో పరిచయం ఏర్పడింది. గౌలిదొడ్డిలో వాసవీ ఉంటున్న హాస్టల్ వద్దకు గణేష్ వచ్చాడు. నీతో కాస్తా మాట్లాడాలని హోటల్ కి వెళ్దామని చెప్పాడు. అందుకు వాసవీ నేను రాను అంటూ చెప్పింది. దీంతో బలవంతంగా వాసవీని హోటల్ కు తీసుకువెళ్లాడు. నార్సింగీ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీ గ్రీల్ హోటల్ వెళ్లిన వారిద్దరు.. అక్కడ చాలా సేపు మాట్లాడుకున్నారు. గత 10 సంవత్సరాలుగా నిన్ను ప్రేమిస్తున్నాను అని వాసవీతో చెప్పిన గణేష్.. నాకు ఆ ఫీలింగ్ లేదు నీవు నా అమ్మ తమ్ముడిగానే చూస్తున్నా అంటూ కోపంతో హోటల్ నుండి బయటకు వచ్చింది. తన వెంటే బయటకు వచ్చి నా ప్రేమను అర్దం చేసుకో అంటూ గణేష్ బతిమిలాడాడు. ఎంతకీ వినకపోవడంతో తన బ్యాగ్ లో ఉన్న కత్తి తీసుకొని వాసవీపై విచక్షణారహితంగా పొడిచాడు ఉన్మాది. గొంతు, ముఖంపై కత్తిపోట్లు పడ్డాయి. దాడి అనంతరం ఉన్మాది అక్కడి నుండి పారిపోయాడు. చాకచక్యంగా వ్యవహరించిన నార్సింగీ పోలీసులు గణేష్ ను అదుపులోకి తీసుకున్నారు.