Kurnool Crime: కర్నూల్‌లో మెడికో ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool Crime: విద్యా సంస్థల్లో కొందరు విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలో తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి.. వైద్యవృత్తి లక్ష్యంగా.. ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులు కూడా ఆత్మహత్యలకు పాల్పడడం కలకలం రేపుతోంది.. తాజాగా, కర్నూలులో మరో మెడికో ప్రాణాలు తీసుకున్నాడు.. విశ్వభారతి మెడికల్ కాలేజీలో లోకేష్ అనే మెడికో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న లోకేష్ స్వస్థలం.. నెల్లూరు జిల్లా కావలిగా చెబుతున్నారు.. ఇక, లోకేష్ ఆత్మహత్య చేసుకున్న విషయంపై తండ్రి బ్రహ్మానందరావుకి సమాచారం ఇచ్చారు పోలీసులు.. మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు పోలీసులు.. ఆత్మహత్యకు చదువులో ఒత్తిడా..? లేకా ప్రేమ వ్యవహారం కారణమా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.. ఈ రెండు కాకుండా మరేదైనా కారణం ఉందా? అనే వ్యవహారంపై కూడా ఆరా తీస్తున్నారు.. చేతికి అందివచ్చిన కొడుకు.. త్వరలో డాక్టరై మా కష్టాలు తీర్చుతాడని కలలు గంటున్న ఆ పేరెంట్స్ ఆశలపై నీళ్లు చల్లి ప్రాణాలు తీసుకున్నాడు లోకేష్. కాగా, గతంలోనూ చదువుల ఒత్తడి.. ఇతర కారణాలతో మెడికోలో ఆత్మహత్య చేసుకున్న ఘటనలో చాలానే వెలుగుచూసిన విషయం విదితమే.
Read Also: Astrology: జూన్ 26, సోమవారం దినఫలాలు
Also Read
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!