Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు హైదరాబాద్ లో వైన్స్ బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజుల పాటు వైన్స్ షాప్స్ బంద్ చేస్తున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్ లో రెండు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. సెప్టెంబర్ 28, 29వ తేదీల్లో వైన్స్ షాపులు బంద్ చేస్తున్నాట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 28వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వైన్స్ షాపులు సెప్టెంబర్ 28, 29వ తేదీల్లో బంద్ అవుతున్నాయి. అయితే వైన్స్ షాపులు మాత్రమే మూతపడనున్నాయి. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్ లకు ఈ బంద్ నుంచి మినహాయింపు ఇచ్చింది. వినాయక నిమజ్జనం సందర్భంగా రెండు రోజుల పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో వైన్స్ షాపులు, బార్లను మూసివేయాలని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Ayodhya Ram Mandir: డిసెంబరు చివరికల్లా పనులు పూర్తి.. జనవరిలో రామమందిర ప్రాణప్రతిష్ఠ
Also Read
ఇక, నిమజ్జనం సమయంలో మద్యం తాగి రావద్దని కూడా పోలీసు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 28, 29 తేదీలలో హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున వినాయక నిమజ్జనం జరుగనుంది. ఈ నిమజ్జనాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్ బండ్‌కు తరలి వస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలోని ఆయా ప్రాంతాల మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 28 గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం, సెప్టెంబర్ 29 ఉదయం 4 గంటల వరకు ప్రత్యేక ఎంఎంటీఎస్ సర్వీసులు నడపాలని దక్షిణ మధ్య రైల్వేశాఖ నిర్ణయించింది. హైదరాబాద్- లింగంపల్లి, సికింద్రాబాద్- హైదరాబాద్, లింగంపల్లి- ఫలక్‌నుమా మధ్య పెద్ద మొత్తంలో 8 రైళ్లు ప్రత్యేక రైళ్లు సేవలందిస్తాయని దక్షిణ మధ్య రైల్వే శాఖ పేర్కొంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు