Haryana: హర్యానాలో ఓ కాంట్రాక్టర్కు చిత్రహింసలు.. నోట్లో పేడ, ఉమ్మివేసి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలోని హిసార్ జిల్లాలో ఓ కాంట్రాక్టర్ ను చిత్రహింసలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముందుగా కాంట్రాక్టర్‌ను కిడ్నాప్ చేసి చితకబాదారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కరెంట్ షాక్ తో ఇబ్బందులకు గురిం చేశారు. అంతేకాకుండా కిడ్నాపర్లు గేదెల పేడను నోటిలో వేసి.. ముక్కుపై షూ రుద్దడంతోపాటు ఉమ్మి కూడా వేశారు. అయితే ఈ అరాచకాన్ని మొత్తం ఫోన్లలో వీడియో కూడా తీశారు కిడ్నాపర్లు. అనంతరం వారి చెరనుండి బయటపడిన కాంట్రాక్టర్.. పోలీసులకు సమాచారం మొత్తం చెప్పాడు. దీంతో నిందితులు సంత్‌లాల్‌తో పాటు అతని ఇద్దరు కుమారులు, సందీప్, వికాస్, పీకే, ఆత్మారామ్, విక్రమ్, నవీన్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
Lioness Dies Of Heart Attack: గుండెపోటుతో సింహం మహేశ్వరి మృతి
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
వివరాల్లోకి వెళ్తే.. కాంట్రాక్టర్ రాకేష్ ప్రభుత్వ పనుల కోసం కాంట్రాక్టులు తీసుకుంటాడు. అయితే పొలాల్లో నిర్మించిన రెండు ఇళ్లకు వెళ్లే రోడ్డుకు శంకుస్థాపన చేయాలని సదల్‌పూర్‌కు చెందిన సంతలాల్ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయన పొలాలకు వెళ్లే రహదారికి ప్రభుత్వం ఆమోదించింది.. కానీ సంతలాల్ మాత్రం ప్రభుత్వం అంగీకరించలేదని చెప్పాడు. దీంతో సంతలాల్ కాంట్రాక్టర్ పై పగ పెంచుకున్నాడు.
Ravi Kishan: డానిష్ అలీపై చర్య తీసుకోవాలి..స్పీకర్ని కోరిన రేసుగుర్రం విలన్..
అయితే సెప్టెంబర్ 22న సాయంత్రం 5 గంటల సమయంలో కారులో వెళ్తుండగా.. మార్గమధ్యలో తనను ఓ కారులో వచ్చి ఆపారని కాంట్రాక్టర్ తెలిపాడు. అంతేకాకుండా ఆ కారులో నుంచి సంత్‌లాల్ కుమారుడు సందీప్, మరో వ్యక్తి వచ్చి తనను కొట్టారన్నాడు. అంతేకాకుండా తనను కారులో తీసుకెళ్తూ కొట్టారని బాధితుడు ఆరోపించాడు. మార్గమధ్యంలో వెళ్తుండగా కళ్లకు గంతలు కట్టినట్లు రాకేష్ చెప్పాడు. పొలాల్లో నిర్మించిన ఓ ఇంటికి తీసుకెళ్లి గదిలోకి తీసుకెళ్లి బెల్టులతో కొట్టారని కాంట్రాక్టర్ చెప్పాడు. అంతేకాకుండా.. కరెంటు షాక్ లు పెడుతూ.. నోటిలో గేదె పేడ పెట్టారని తెలిపాడు. కాంట్రాక్టర్ రాకేష్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఈ వ్యవహారంలో సంత్‌లాల్, అతని కుమారులతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!