Atrocious: ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. 7 ఏళ్ల అమాయక బాలికపై అత్యాచారం చేసి దారుణంగా గొంతుకోసి హత్య చేశారు. చిన్నపిల్లపై అఘ్యాయిత్యాలు ఆగడం లేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గంజాయి చెట్ల పెంపకం కలకలం రేపుతుంది. తంగళ్ళపల్లి మండల కేంద్రం ఇందిరా నగర్ కాలనీలో పోలీసులు భారీగా గంజాయి చెట్లు స్వాధీనం చేసుకున్నారు. మొహమ్మద్ హైదర్ (64) అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలోనే 31 గంజాయి చెట్లను పెంచుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు. దాంతో అక్కడికి వెళ్లి పరిశీలించారు. గంజాయి మొక్కల పెంపకంపై పోలీసులు ఆరా తీయగా.. వాటిని 48 సంవత్సరాలుగా సాగు చేస్తున్నట్లు హైదర్ తెలిపారు.
నవీ ముంబైలో కిడ్నాప్ కలకలం రేపింది. తన ఇంటి బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని ఓ దుండగుడు కిడ్నాప్ చేశాడు. ఈ కేసుకు సంబంధించి 74 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నెరుల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న తమ కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు నేరుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈనెల 29వ తేదీన ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరుగనుంది. గణేష్ నిమజ్జనం కారణంగా బందోబస్తు ఇవ్వలేమని హైదరాబాద్ పోలీసులు చెప్పడంతో.. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ నిర్వహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రెడీ అయింది.
Dalit Woman Raped by SI in UP: ప్రజలను కాపాడాల్సిన పోలీసే.. సమాజం తలదించుకునే పని చేశాడు. ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వచ్చిన ఓ దళిత మహిళపై సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్సై) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది. దళిత మహిళపై అత్యాచారం చేసిన ఎస్సైని సస్పెండ్ చేసినట్లు ఉన్నత అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న ఆ ఎస్సైని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సరాయ్ మమ్రేజ్…
హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజుల పాటు వైన్స్ షాప్స్ బంద్ చేస్తున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్ లో రెండు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. సెప్టెంబర్ 28, 29వ తేదీల్లో వైన్స్ షాపులు బంద్ చేస్తున్నాట్లు ప్రకటించారు.
యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్య, ఇద్దరు సోదరులతో సహా తనపై దాడి చేశారని.. ప్రాణహాని ఉందని ఓ లెక్చరర్ ఆరోపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. రంగయ్యపల్లిలోని చెరువులో నలుగురు గల్లంతు అయ్యారు. చెరువులో స్నానానికి వెళ్లిన బాలుడు గల్లంతు కాగా.. అతడిని కాపాడేందుకు ఒక మహిళ ప్రయత్నించింది.. ఈ క్రమంలోనే సదరు మహిళ గల్లంతైంది.. ఇక, మరో ఇద్దరు మహిళలు కూడా వారిని కాపాడేందుకు ప్రయత్నించి చెరువులో గల్లంతు అయ్యారు.
హర్యానాలోని హిసార్ జిల్లాలో ఓ కాంట్రాక్టర్ ను చిత్రహింసలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముందుగా కాంట్రాక్టర్‌ను కిడ్నాప్ చేసి చితకబాదారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కరెంట్ షాక్ తో ఇబ్బందులకు గురిం చేశారు. అంతేకాకుండా కిడ్నాపర్లు గేదెల పేడను నోటిలో వేసి.. ముక్కుపై షూ రుద్దడంతోపాటు ఉమ్మి కూడా వేశారు. అయితే ఈ అరాచకాన్ని మొత్తం ఫోన్లలో వీడియో కూడా తీశారు కిడ్నాపర్లు.