UP Police: ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతిపై పోలీసు అత్యాచారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dalit Woman Raped by SI in UP: ప్రజలను కాపాడాల్సిన పోలీసే.. సమాజం తలదించుకునే పని చేశాడు. ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వచ్చిన ఓ దళిత మహిళపై సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది. దళిత మహిళపై అత్యాచారం చేసిన ఎస్సైని సస్పెండ్ చేసినట్లు ఉన్నత అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న ఆ ఎస్సైని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి..
సరాయ్ మమ్రేజ్ పోలీస్ స్టేషన్‌లో సుధీర్ కుమార్ పాండే సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు. కొందరు ఆకతాయిలు తనను వేధింపులకు గురి చేస్తున్నారని, చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ దళిత మహిళ ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చింది. ఎస్సై సుధీర్ కుమార్ పాండేకు విషయం చెప్పి.. ఫిర్యాదు చేసింది. నిందితులను అరెస్టు చేసేందుకు వెళుతున్నట్లు చెప్పిన ఎస్సై.. యువతిని తన కారులో ఎక్కించుకున్నాడు.
Also Read
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ఎస్సై సుధీర్ కుమార్ పాండే మార్గమధ్యలో కారు ఆపి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్‌ను దళిత మహిళతో తాగించాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లాక.. కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మెలుకువ వచ్చాక విషయం తెలుసుకున్న బాధితురాలు సదురు పోలీసుపై ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 21న సుధీర్ కుమార్ పాండే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దాంతో సీనియర్ పోలీసు అధికారి సుధీర్ కుమార్ అతడిని (ఎస్సై) ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. పరారీలో ఉన్న ఎస్సై కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై విచారణ జరపాల్సిందిగా హండియా ఏసీపీ సుధీర్ కుమార్‌ను పోలీసు కమిషనర్ రమిత్ శర్మ ఆదేశించారు.
- Tags
- Crime News
- police
- si
- UP
- UP Police
తాజావార్తలు
-
Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!