Physical Harassment: చాక్లెట్ ఆశ చూపి నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. చిన్నారి పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో నాలుగేళ్ల బాలికపై ఓ క్రూరుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. వరుసకు చిన్నారి మేనకోడలు అవుతుంది. అయితే ఆ చిన్నారికి చాక్లెట్ తినిపిస్తానని చెప్పి తీసుకొని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే విధంగా నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే ఈ ఘటన తెలుసుకున్న చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నిందితుడు, అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు.
Read Also: Chandrababu CID Custody: కాసేపట్లో ముగియనున్న చంద్రబాబు కస్టడీ.. నెక్స్ట్ ఏంటీ?
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
వివరాల్లోకి వెళ్తే.. ఈ హృదయ విదారక ఘటన గోపాల్‌గంజ్ జిల్లాలోని మీర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తమ ఇంటి పక్కనే నివసిస్తున్న 22 ఏళ్ల యువకుడు చాక్లెట్ ఇస్తానని చెప్పి తన కూతురిని తీసుకెళ్లాడని బాధితురాలి తల్లి తెలిపింది. ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డాడని.. బాలిక ఏడుపు వినిపించడంతో ఆమె అక్కడికి వెళ్లి చూసేసరికి తాను షాక్ అయినట్లు చెప్పింది. బాలిక నేలపై పడి ఉండటం, ఆమె ప్రైవేట్ పార్టులు రక్తస్రావం అయ్యాయని పేర్కొంది. తాను అక్కడకు వెళ్లడం చూసి నిందితుడు పరారయ్యాడని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
Read Also: IND vs AUS: వన్డేలలో భారత్ అత్యధిక స్కోర్లు ఇవే.. ఈరోజు మ్యాచ్లో సాధ్యమయ్యేనా..!
రక్తస్రావంతో ఉన్న బాలికను పోలీసులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు గోపాల్‌గంజ్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలికను ఎమర్జెన్సీ వార్డులో చేర్చగా పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి నిందితుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడని.. కుటుంబం మొత్తం పరారీలో ఉన్నారని బాధితురాలి తండ్రి తెలిపారు. నిందితుడిపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకుని బాలికకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!