Kadapa Crime: ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. కడపలో సంచలనం సృష్టిస్తోన్న కానిస్టేబుల్ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కడపలోని కోపరేటివ్ కాలనీలో తన భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు.. అయితే, ఆ కుటుంబంలో ఏం జరిగిందనే విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపేశాడు కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు.. ఇక, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటేశ్వర్లు ప్రస్తుతం కడప రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న కడప పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలకు ఆస్పత్రికి తరలించారు.. కుటుంబ కలహాలతోనే వెంకటేశ్వర్లు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.. కానీ, ఒకేసారి నలుగురి ప్రాణాలు పోవడం.. స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Bigg Boss Telugu 7: బిగ్ బాస్ 7 మినీ లాంచ్ ఈవెంట్.. ఈ వారం మరో ఆరుగురు ఎంట్రీ..