వికారాబాద్ జిల్లా తాండూర్ లోని రాజీవ్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం పై అంతస్తులో వాటర్ క్యూరింగ్ చేస్తుండగా ప్రమాదవ శాత్తు జారీ కింద పడి జనార్ధన్ అనే (కూలి ) వృద్ధుడు సంఘటన ప్రదేశంలోనే మృతి చెందాడు. దీంతో సదరు బిల్డింగ్ యజమాని ఆ వృద్ధుడి మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చరికి తరలించాడు. ఇక, విషయం తెలిసిన మృతుని బంధువులు మార్చురీ దగ్గర ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
Read Also: Flipkart : ఫ్లిప్ కార్ట్ వ్యాన్ నుంచి గాల్లోకి రూ.2వేల నోట్లు.. ఎక్కడంటే?
అయితే, విషయం తెలుసుకున్న యలాల్ ఎస్ఐ అరవింద్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేశాడు. ఇక, ఇదై సమయంలో ఎస్ఐ అరవింద్ బిల్డింగ్ యజమానితో కుమ్మక్కై తమను బెదిరిస్తున్నాడని మృతుని బంధువులు ఆరోపించారు. తాము కర్ణాటక చెందిన వాళ్లం కావడంతో తమను ఇష్టం వ్చ్చినట్లు ఎస్ఐ బూతులు తిట్టాడని మృతుని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు సరైన న్యాయం చేయాలని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు పోలీసులే న్యాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారని మృతుని బంధువులు వాపోయారు.