Hyderabad: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడం తో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే పలు చోట్ల భారీ మొత్తంలో నగదు, బంగారం సీజ్ చేశారు. వివరాలలోకి వెళ్తే.. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో 3 కోట్ల నగదుని సీజ్ చేశారు. నార్సింగిలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ/ 88 లక్షల నగదు పట్టుబడింది. అలానే నిజాం కాళాశాల దగ్గర 7 కిలోల బంగారం, అలానే 300 ల కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అబిడ్స్ లో 7 కిలోల బంగారం, 3 టన్నుల వెండిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలానే వనస్థలిపురంలో రూ/ 4 లక్షల నగదు పట్టుబడింది.
Read also:Visakhapatnam: ప్రియుడితో వచ్చింది… వాడు పరార్.. ప్రేయసి బేజార్
కాగా హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో జరిగిన వాహన తనిఖీలలో రూ/ 30 లక్షల నగదు పట్టుబడింది. శంకరపల్లిలో నిర్వహించిన తనిఖీల్లో రూ/80 లక్షల నగదు పట్టుబడింది. మంగళ్హాట్ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా రూ/ 15 లక్షల నగదు పట్టుబడింది. షాద్ నగర్ పరిధిలో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో పోలీసులు మాట్లాడుతూ హైదరాబాద్ లో పలు చోట్ల తినిఖీలు నిర్వహించగా భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండి పట్టుబండిందని తెలియ చేసిన పోలీసులు.. ఎవరైనా రూ/ 50 వేలకు మించి నగదు, బంగారం బయటకి తీసుకురావాల్సి వస్తే సరైన పత్రాలను దగ్గర ఉంచుకోవాలి అని.. అలా లేని పక్షంలో సీజ్ చేస్తామని హెచ్చరించారు.