రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి నిద్రిస్తున్న సమయంలో తమ్ముడిని తన అన్న కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తఖా గ్రామంలో జరిగింది. వీరిద్దరి మధ్య పంటల పంపిణీపై అర్థరాత్రి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో తమ్ముడిని అన్న దారుణంగా హతమార్చాడు. మినుము పంటను కోసి ఇంటికి తీసుకువచ్చాడని.. ఈ కారణంగా మద్యం మత్తులో ఇద్దరు సోదరులు గొడవ పెట్టుకున్నారు. అయితే గొడవ జరిగిన తర్వాత కుటుంబ సభ్యులంతా నిద్రలోకి జారిపోయారు. గొడవ నేపథ్యంలో కక్ష పెట్టుకున్న అన్న లోకేశ్.. తన తమ్ముడు ధన్వీర్ తలపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత అన్న పరారీలో ఉన్నాడు. మరోవైపు ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులు సమాచారం ఇవ్వకుండానే.. ధన్వీర్ మృతదేహాన్ని అంత్యక్రియలు చేసేందుకు వెళ్లారు. ఆ తర్వాత మృతుడి తండ్రి పురాణ్‌సింగ్ పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు.
Bandla Ganesh: కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మాత బండ్ల గణేష్.. ఆయన రియాక్షన్ ఇదే..
ఈ ఘటనపై మృతుడి తండ్రి స్పందించారు. అర్థరాత్రి లోకేశ్, ధన్‌వీర్‌ల మధ్య గొడవ జరిగిందని తెలిపాడు. ఈ క్రమంలో లోకేష్ పదునైన ఆయుధంతో ధన్వీర్ తలపై దాడి చేశాడని.. ఆ సమయంలో తాము నిద్రపోతున్నట్లు చెప్పాడు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. తఖా గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందిందని ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ రాకేష్ కుమార్ తెలిపారు. ఈ ఘటన గురించి ఎవరికీ తెలియజేయకుండా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేస్తున్నారని.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూడగా తలపై బలమైన గాయం ఉందన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించామని.. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.