ఊరి చెరువులో వ్యర్థ పదార్థాలు, చెత్తను తొలగించేందుకు నీటిలో దిగి ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు గల్లంతు అయ్యారు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామంలో చోటు చేసుకుంది.
ప్రవళిక మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మీడియా సమావేశం ద్వారా కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. అశోక్ నగర్లో స్టూడెంట్ ప్రవళిక ఆత్మహత్యపై దర్యాప్తు చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
బీహార్ లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. నలంద పోలీస్ స్టేషన్ పరిధిలోని సబ్బైత్ గ్రామంలో ఓ యువకుడిని ఇంటి నుంచి తీసుకుని వెళ్లిన తన స్నేహితుడు అనంతరం కాల్చిచంపాడు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. అయితే ఘటనా స్థలం నుంచి పారిపోతున్న ఇద్దరు స్నేహితులను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వారి నుంచి ఒక పిస్టల్, 14 లైవ్ కాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు. మృతుడు మహ్మద్ అల్మాజ్(18)గా గుర్తించారు.
రాజస్థాన్లోని భరత్పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి నిద్రిస్తున్న సమయంలో తమ్ముడిని తన అన్న కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తఖా గ్రామంలో జరిగింది. వీరిద్దరి మధ్య పంటల పంపిణీపై అర్థరాత్రి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో తమ్ముడిని అన్న దారుణంగా హతమార్చాడు.
వికారాబాద్ జిల్లా తాండూర్ లోని రాజీవ్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం పై అంతస్తులో వాటర్ క్యూరింగ్ చేస్తుండగా ప్రమాదవ శాత్తు జారీ కింద పడి జనార్ధన్ అనే (కూలి ) వృద్ధుడు సంఘటన ప్రదేశంలోనే మృతి చెందాడు.