తిరుమల తిరుపతిలో కిడ్నాప్ కలకలం రేపుతుంది. తిరుమల ఆర్టీసీ బస్టాండ్ లో రెండేళ్ల బాబు కిడ్నాప్ కు గురయ్యాడు. రాత్రి రెండు గంటల సమయంలో రిజర్వేషన్ కౌంటర్ దగ్గర కిడ్నాప్ చేశారు. అయితే, శ్రీవారి దర్శనానికి చెన్నైకి చెందిన కుటుంబం వచ్చింది.
భూవివాదం తెచ్చిన గొడవతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు, మరికొంత మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు ఉండటంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని డియోరియాలో జరిగింది.
మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాది మహ్మద్ షానవాజ్ అలియాస్ షఫీగా గుర్తించారు. ఈ ఉగ్రవాది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. ఇతనితో పాటు మరో ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ అనుమానిత ఉగ్రవాదులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Lady Constables drag Woman on road in UP’s Hardoi: ఉత్తర్ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ వికలాంగ మహిళను ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు రోడ్డుపై ఈడ్చుకొంటూ తీసుకువెళ్లారు. ఎస్పీ కార్యాలయం నుంచి సమీప పోలీస్స్టేషన్ వరకు ఆమెను లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) కేశవ్ చంద్ర గోస్వామి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. హర్దోయీ…
టీడీపీ మాజీమంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తి అరెస్టుపై ఉత్కంఠ.. అర్ధరాత్రి తర్వాత పరవాడ మండలం వెన్నెల పాలెంలో భారీగా మోహరించిన పోలీసులు.. బండారు ఇంటికి వెళ్లే మార్గాలు మూసివేత.. ఇటీవల మంత్రి రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బండారు..
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సెంట్రల్ నోయిడా ఎకోటెక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో నిద్రిస్తున్న బాలికను గుర్తు తెలియని దుండగులు రాళ్లతో కొట్టి చంపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
తామే నిజమైన దేశభక్తులమని, తెలంగాణ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాము చెప్పినట్లే నడవాలంటూ ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ తీవ్రంగా ఖండించాడు. ‘‘ మీరు దేశభక్తులా.... ఏ దేశానికి? పాకిస్తాన్ కా... ఆఫ్ఘనిస్తాన్ కా?’’అని ప్రశ్నించారు.