మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాది మహ్మద్ షానవాజ్ అలియాస్ షఫీగా గుర్తించారు. ఈ ఉగ్రవాది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. ఇతనితో పాటు మరో ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ అనుమానిత ఉగ్రవాదులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని అరెస్టు సమయంలో నిందితుల దగ్గర నుంచి ఐఈడీ తయారీకి ఉపయోగించే లిక్విడ్ కెమికల్ సహా పలు కీలక సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. మహ్మద్ షానవాజ్ తలపై రూ.3 లక్షల రివార్డు ఉంది.
WhatsApp: ఇండియాలో 74 లక్షల అకౌంట్లపై వాట్సాప్ బ్యాన్..
ఢిల్లీలోని ఓ రహస్య స్థావరంలో ఈ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. మరోవైపు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్.. పలు రాష్ట్రాల్లోని ఉగ్రవాద నెట్ వర్క్ లను అణచివేసేందుకు ఎన్ ఐఏతో కలిసి పనిచేస్తుంది. దాని ఆధారంగా వారిని అరెస్టు చేసింది. ఉగ్రవాది షానవాజ్.. పుణె ఐసిస్ మాడ్యూల్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఢిల్లీకి చెందిన ఈ టెర్రరిస్ట్.. పుణె పోలీసుల చెర నుంచి తప్పించుకుని.. అప్పటి నుంచి ఢిల్లీలో పోలీసుల కంట పడకుండా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఉగ్రవాదులను.. షానవాజ్, రిజ్వాన్ అబ్దుల్ హాజీ అలీ, అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్ వాలాలను పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే వీరి గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.3 లక్షల చొప్పున ప్రైజ్ మనీ ఇస్తామని ఎన్ఐఏ ఇంతకుముందు ప్రకటించింది.
ఈ ఉగ్రవాదులు టెలిగ్రామ్ యాప్ ద్వారా ఐసిస్ మిషన్ లో చేరినట్లు తెలిసింది. వీరికి మహారాష్ట్రలోని పుణెలో ఐసిస్ మాడ్యూల్ తో సంబంధాలు ఉన్నట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. దేశంలో హింస, ఉగ్రవాదాన్ని సృష్టించాలనుకున్నారని ఎన్ఐఏ తెలిపింది. అంతేకాకుండా.. పేలుడు పదార్థాలను అసెంబుల్ చేయడానికి ఉపయోగించే డైపర్ స్టోర్ను అబ్దుల్లా పుణెలో నడుపుతున్నట్లు సమాచారం.
Meruga Nagarjuna: చంద్రబాబు దొరికిపోయిన దొంగ.. ప్రజాధనాన్ని కొల్లగొట్టాడు..
మరోవైపు 2018లో రిజ్వాన్ అలీ, అతని తమ్ముడిని ఐఎస్ఐఎస్ లింకుల ఆరోపణలపై అరెస్టు చేశారు. ఆ తర్వాత భద్రతా సంస్థలు వారికి వ్యతిరేకంగా ఆధారాలు చూపెట్టకపోవడంతో.. డీరాడికలైజేషన్ కార్యక్రమం అనంతరం అతడిని విడుదల చేశారు. ఆ తర్వాత రెండేళ్ల క్రితం పుణె వెళ్లి కంప్యూటర్ వ్యాపారం చేస్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పాడు. అంతేకాకుండా.. పెళ్లి చేసుకుని భార్యతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. అయితే రిజ్వాన్ తండ్రి ఆరోగ్య సమస్యల దృష్ట్యా రిజ్వాన్ దంపతులు ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఆ తర్వాత రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు.