Balayya Fans: సోషల్ మీడియా ప్రభావంతో ఏది రియల్.. ఏది వైరల్.. ఏది నిజం.. ఏది ఫేక్ అని నిర్ధారించుకోవడమే కష్టంగా మారింది.. కొన్నిసార్లు ఎవరో చేసిన పనికి.. ఇంకా ఎవరో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది.. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఇదే పరిస్థితి ఎదురైంది.. ఎవరో పెట్టిన ఫేక్ పోస్టుకు.. రాత్రి వరకు పోలీస్ స్టేషన్‌లోనే ఉండాల్సిన స్థితి ఏర్పడింది..
Read Also: India Playing 11: సూర్య, సిరాజ్‌కు దక్కని చోటు.. ప్రపంచకప్‌కు భారత్ తుది జట్టు ఇదే!
పూర్తి వివరాల్లోకి వెళ్తే నంద్యాలలో జరిగిన ఓ ఘటనకు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టింగ్ కలకలం సృష్టించింది.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ అభిమానుల సంఘం పేరిట సోషల్ మీడియాలో ఫేక్ పోస్టింగ్ పెట్టారు గుర్తుతెలియని వ్యక్తులు.. ఛలో రాజమహేంద్రవరం నిర్వహించి చంద్రబాబును నిర్బంధించిన జైలు వద్ద ధర్నా నిర్వహించాలని, రాస్తారోకో చేయాలని ఫేక్ పోస్టింగ్ లో పిలుపునిచ్చారు. అది చూసిన పోలీసులు.. మాజీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్ సహా ఆరుగురు బాలయ్య అభిమానులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. బుధవారం రోజు సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు.. అయితే, సోషల్ మీడియాలో వచ్చింది ఫేక్ పోస్టింగ్ అని ఇంటెలిజెన్స్ సిబ్బంది నిర్ధారించారు.. ఆ తర్వాత అదుపులో ఉన్నవారిని అర్ధరాత్రి వదిలిపెట్టారు పోలీసులు.