Rohit Sharma: బట్లర్ కోరిక తీర్చిన రోహిత్ శర్మ.. ప్రత్యేక సందేశంతో హిట్ మ్యాన్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లాండ్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో టీమిండియా కెప్టెన్, ‘హిట్‌మాన్’ రోహిత్ శర్మ మూడో వన్డేలో 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 138 రన్స్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. లార్డ్స్‌లో వన్డే సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్‌గా ఆయన నిలిచారు. ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కు తన సంతకంతో కూడిన జెర్సీని బహుమతిగా ఇచ్చారు. ఈ జెర్సీని సాధించడానికి తాను పడిన కష్టాన్ని, అనుభవించిన కంగారును బట్లర్ ‘ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్’ యూట్యూబ్ ఛానెల్లో పంచుకున్నారు.
జెర్సీ కోసం ఆరాటం: “నా దగ్గర లేని ఏకైక దిగ్గజ ఆటగాడి జెర్సీ రోహిత్‌ది మాత్రమే. ఐపీఎల్లో ఆయన నాయకత్వంలో (ముంబై ఇండియన్స్) ఆడినప్పటికీ, రోహిత్ జెర్సీ తీసుకోవడం నా డ్రీమ్” అని బట్లర్ తెలిపాడు. రోహిత్ ఎంతో గొప్ప దిగ్గజం. ఆయనను కలిసి అడగటానికి నాకు చాలా భయం వేసింది. మొదట సిరీస్ ప్రారంభంలో భారత టీమ్ మేనేజర్ రోహిత్ కోసం నా జెర్సీని అడిగారు. దాంతో నా జెర్సీని ఇవ్వడానికి భారత డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లినట్లు బట్లర్ పేర్కొన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ వద్ద రోహిత్ లేకపోవడంతో బట్లర్ కాసేపు ఎదురుచూశాడు. ఆ తర్వాత లార్డ్స్ ‘లాంగ్ రూమ్’ వైపు వస్తుండగా రోహిత్ ఫోన్ మాట్లాడటం బట్లర్ చూశాడు.
Also Read
- Smriti Mandhana: జస్ట్! 53 బంతుల్లోనే విజయం.. అయినా కెప్టెన్ స్మృతి మందాన అసంతృప్తి..
- Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
- Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?

ఆ తర్వాత ఏం జరిగిందో బట్లర్ ఇలా చెప్పుకొచ్చాడు.. “ఆయన ఫోన్లో మునిగిపోయి ఉన్నప్పటికీ, ధైర్యం చేసి జెర్సీ అడిగాను. రోహిత్ ఎంతో వినయంతో వెంటనే ఫోన్ పక్కన పెట్టి ‘సారీ’ చెప్పారు. పైకి వెళ్లి, ఒక మంచి స్పెషల్ మెసేజ్ రాసి తన జెర్సీని నాకు బహుమతిగా ఇచ్చారు” అని బట్లర్ సంతోషం వ్యక్తం చేశారు. సహచర ఆటగాడు లియామ్ డాసన్, జస్ప్రీత్ బుమ్రా జెర్సీని తీసుకుంటుండడం చూసే తాను కూడా రోహిత్‌ని మరోసారి అడగాలని నిర్ణయించుకున్నట్లు బట్లర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Smriti Mandhana: జస్ట్! 53 బంతుల్లోనే విజయం.. అయినా కెప్టెన్ స్మృతి మందాన అసంతృప్తి..
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!