పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ విషాదకరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రేమ జంట ప్రాణం తీసుకుంది. నదిలో పడి ఒకరు, రైలు కింద పడి మరొకరు మృతి చెందారు. అయితే, కొమరాడ మండల కేంద్రానికి చెందిన పద్మజ తోటపల్లి బ్యారేజిలో దూకి ఆత్మహత్య చేసుకోగా.. పార్వతీపురం మండలం చినమరికి గ్రామానికి చెందిన వానపల్లి శ్రావణ్ కుమార్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, వీరి ప్రేమ విఫలం కావడమే కారణమా? అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఒకరి నొకరు ఇష్టపడ్డి.. కొన్నినెలలుగా ప్రేమించుకుంటున్నారన్న స్థానికులు తెలియజేశారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంలో ఈ ప్రేమికులు విఫలమయ్యారని స్థానికులు వెల్లడించారు. ఇక, విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. దీంతో మృతుల కుటుంబాలు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.