Navi Mumbai: ప్రియురాలిని చంపిన ప్రేమికుడు.. నెల తర్వాత మృతదేహం లభ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది డిసెంబర్ లో అదృశ్యమైన ఓ మహిళ మృతదేహాన్ని నవీ ముంబై పోలీసులు మంగళవారం గుర్తించారు. ఖర్ఘర్ హిల్ కాంప్లెక్స్‌లోని అటవీ ప్రాంతంలో ఆమె కుళ్లిపోయిన మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ తన ప్రియుడు నుంచి దూరం కావడంతో ఆమెను గొంతు కోసి ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఓ వార్త కథనం తెలిపింది. మృతురాలు వైష్ణవి (19)గా గుర్తించారు. సియోన్‌లోని ఎస్‌ఐఈఎస్ కాలేజీలో చదువుతోంది. కాగా.. ఆ మహిళ 2023 డిసెంబర్ 12వ తేదీన ఉదయం కాలేజీకి అని వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. కాగా.. ఆ సాయంత్రం తన తల్లి తన కూతురు కాలేజికి వెళ్లి ఇంటికి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read
ఇదిలా ఉంటే.. అదే రోజు ప్రియుడు వైభవ్ కూడా రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జుయినగర్ స్టేషన్ వద్ద రైలు పట్టాలపై అతని మృతదేహం లభ్యమైంది. కాగా.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళ మిస్సింగ్ అయిన రోజు ఖార్ఘర్ హిల్స్ ప్రాంతంలో వారిద్దరూ చివరిసారిగా కనిపించారని పోలీసులు కనుగొన్నారు. ప్రియుడు వైభవ్ మొబైల్ ఫోన్‌లో లభించిన సూసైడ్ నోట్, ఇతర ఆధారాల ప్రకారం అతను వైష్ణవిని చంపే ముందు గొంతు కోసి చంపాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆ తర్వాత ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు.
Read Also: Steel industry: ఈ నెల 29, 30న దేశవ్యాప్తంగా స్టీల్ ఇండస్ట్రీ సమ్మె..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు