హైదరాబాద్ లో పంటి చికిత్సకు వెళ్లి ఓ వ్యక్తి బలయ్యాడు. వింజం లక్ష్మీనారాయణ అనే వ్యక్తి జూబ్లీహిల్స్ రోడ్ నెం.37లో ఎఫ్‌ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్‌లో దంత చికిత్స పొందుతూ మరణించాడు. అయితే.. దంత వైద్యుడి నిర్లక్ష్యంగా కారణంగా మృతి చెందాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అనస్థీషియా ఎక్కువ మోతాదులో ఇవ్వడమే లక్ష్మీనారాయణ మరణానికి కారణమైందని అంటున్నారు.
Read Also: Fire Accident: కొందుర్గులోని స్కాన్ ఎనర్జీ పరిశ్రమలో భారీ పేలుడు.. ముగ్గురి పరిస్థితి విషమం
లక్ష్మి నారాయణ స్మైల్-డిజైనింగ్ అనే ప్రక్రియ కోసం ఈ క్లినిక్‌కు వెళ్లాడు. అయితే చికిత్స సమయంలో అతనికి అనస్థీషియా ఇచ్చారు. దీంతో అతను స్పృహ కోల్పోగా.. బాధితుడిని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితుడిని పరిశీలించిన వైద్యులు మరణించినట్లు తెలిపారు. దీంతో.. తన కుమారుడి మృతికి దంతవైద్యుడే కారణమంటూ బాధితుడి తండ్రి వింజం రాములు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అధికంగా అనస్థీషియా ఇవ్వడంతోనే తన కొడుకు మరణించాడని ఫిర్యాదులో తెలిపాడు. దంత వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని తండ్రి రాములు పోలీసులను కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
Read Also: Ranchi Test: కేఎల్ రాహుల్ జట్టులోకి వస్తే.. అతడిపై వేటు తప్పదు! యశస్వి డౌటే