Rampachodavaram: ఆ మధ్య వచ్చిన పుష్ప సినిమాలో కొన్ని సీన్లు.. దొంగతనం ఎలా చేయాలో కళ్లకు కట్టినట్టు చూపించారు.. అధికారులు, పోలీసుల కళ్లుగప్పి.. ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్ చేశారు.. ఎలా తప్పించుకున్నారో పలు కోణాల్లో చూపించారు.. అయితే, ఆ తర్వాత ఆ తరహా ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి.. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మన్యంలో అటవీ ప్రాంతంలో పుష్ప సీన్ రిపీట్ అయ్యింది.. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి నూర్పిడి అటవీ ప్రాంతంలో ఉన్న టేకు ప్లాంట్ లో మాయమైన టేకు చెట్ల బాగోతం..
Read Also: MS Dhoni – Sachin: ఆ విషయంలో ధోనికి సిగ్గెక్కువంటున్న సచిన్..!
అయితే, గుట్టుచప్పుడు కాకుండా 400పైగా భారీ టేకు, మారు జాతి వృక్షాలు మాయం చేశారు.. అధికారుల కనుసన్నల్లోనే 50 లక్షల రూపాలయ పైనే విలువైన టేకు చెట్లను అటవీ సిబ్బంది చొరవతోనే జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణ చేసిన అధికారులు.. కాగా, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అవినీతి సిబ్బందిపై అటవీ ప్రాంతంలో మాయమైన టేకు చెట్ల వివరాలను సేకరిస్తున్నారు సీసీఎఫ్, స్క్వాడ్, విజిలెన్స్ టీం ఉన్నతాధికారులు .. టేకు చెట్ల అక్రమ దోపిడీపై ఇప్పటికే రాష్ట్ర స్థాయి, జిల్లాల నుండి ప్రత్యేక బృందాలు రంపచోడవరం డివిజన్ లోని అన్ని రేంజ్ పరిధిలో టెక్ ప్లాంటు లను పరిసలించి.. అవినీతి అధికారులు డేటాను విజిలెన్స్ అధికారులు, ప్రత్యేక బృందాలు పంపించాయి.. ఉన్నతాధికారులు ఆదేశాలతో ఇప్పటికే డిప్యూటీ రేంజ్ అధికారి,బీట్ అధికారిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.. దర్యాప్తు లో మరికొందరిపై వేటు పడుతుందని సమాచారం.. మరింత వేగంగా దర్యాప్తులో ఎంతమంది ఉన్నా కఠిన చర్యలు తప్పవంటూ రేంజర్ ఆజాద్ వెల్లడించారు.