ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఇదివరకే పూర్తయ్యాయి. మార్చి 1 నుండి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు వోకేషనల్ కోర్స్ తో కలిపి 10,52,673 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 52,900 విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వలేదు. 75 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో మాల్ ప్రాక్టీస్ కు ప్రయత్నించారు. వీటికి సంబంధించి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇంటర్మీడియట్ సంబంధించిన ఇంటర్ సమాధాన పత్రాలు మూల్యాంకనం కూడా మొదలైంది. ఏప్రిల్ 4వ తేదీ నాటికి ఈ పేపర్ కరెక్షన్ పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పూర్తయిన వెంటనే ఏప్రిల్ 2 వారంలో ఫలితాలు విడుదల చేస్తున్నట్లు సమాచారం.
Also Read: SRH vs KKR: ఉత్కంఠపోరులో కేకేఆర్ గెలుపు.. క్లాసెన్ శ్రమ వృధా
ఇక ఈసారి ఎన్నడూలేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22,000 కెమెరాలను ఉపయోగించి పరీక్షలను నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సిసిటీవీలను పరిక్షించెందుకు గుంటూరు జిల్లా తాడేపల్లి లోని బోర్డు కార్యాలయం కేంద్రంగా అధికారులు పనిచేశారు. మరోవైపు పరీక్ష పత్రాలు ఎక్కడ కూడా లీక్ కాకుండా ఉండేటట్లు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు అధికారులు. ముఖ్యంగా ఇందుకు సంబంధించి క్యూఆర్ కోడ్ లను జత చేసి పరీక్షలను నిర్వహించారు.
Also Read: Thug Life: కమల్- మణిరత్నం ‘సినిమా’ కష్టాలు!
ఇదివరకు పరీక్షల నిర్వహణ కోసం విద్యార్థుల నుంచి ఫీజు చెల్లింపులను చలానా రూపంలో విద్యార్థుల నుంచి తీసుకునేవారు. కాకపోతే., ఈ సంవత్సరం ఈ పద్ధతికి సెలవు చెప్పి ఆన్లైన్ విధానం తీసుకురావడంతో ఎలాంటి పొరపాట్లకు లోను కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు ఇంటర్ ప్రాక్టికల్ సంబంధించి కూడా అధికారులు సాంకేతికను ఉపయోగించి బోర్డు వెబ్సైట్లో అక్కడికక్కడే మార్కులను నమోదు చేయించారు. ఇక మార్కుల విషయంలో కూడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా రెండుసార్లు ఎగ్జామినర్ ఆన్లైన్లో నమోదు చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.