Kadapa Crime: కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒంటిమిట్ట రెవెన్యూ అధికారులు తమ భూమిని ఆన్‌లైన్ చేయడంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని మనస్థాపానికి గురైన సుబ్బారావు ఆయన భార్య పద్మ.. వాళ్ల కుమార్తె వినయతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పద్మ, వినయ ఇంట్లో ఆత్మహత్య చేసుకోగా.. భర్త సుబ్బారావు మాత్రం ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్వాపరాలను విచారిస్తున్నారు. అసలు రెవెన్యూ అధికారులు వారి భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించకుండా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.. ఆ భూమిపై ఉన్న సమస్యలు ఏంటి? లాంటి వివరాలపై కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. భూమి వ్యవహారంలోనే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారా? ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ సాగుతున్నట్టు సమాచారం.
Read Also: Uttarpradesh : రూ.54 బొగ్గు చోరీ కేసులో 32 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు.. శిక్ష ఏంటంటే ?