8000mAh బ్యాటరీ, 7-అంగుళాల OLED డిస్ప్లే, 50MP కెమెరా.. Redmi నుంచి కొత్త ఫోన్ విడుదల తేదీ ఖరారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రఖ్యాత స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ భారత్‌లో తన నూతన మోడల్ ‘రెడ్మీ నోట్ 17’ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకారించింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన టీజర్లు హల్చల్ చేయగా.. ఇప్పుడు ఆగస్టు 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరిస్తున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎన్నో అత్యుత్తమ ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నారు. ప్రధానంగా 8000mAh భారీ బ్యాటరీని అందించడం ఈ ఫోన్ ప్రధాన ప్రత్యేకత. ఇది వినియోగదారులకు సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. దీనితో పాటు ఫొటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ AI కెమెరా, ఐపీ69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, సరికొత్త హైపర్ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ రానుంది.
ఈ ఫోన్లో 7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ (OLED) డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది గేమింగ్, వీడియా వీక్షణకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. పనితీరు కోసం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రొసెసర్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, వైఫై 6, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్సీ, టైప్-సి పోర్ట్‌లతో పాటు డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే స్టీరియో స్పీకర్లు, ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉన్నాయి. ధర వివరాల విషయానికి వస్తే.. అధికారికంగా ప్రకటించకముందే ప్రముఖ టిప్‌స్టర్ సమాచారం ప్రకారం 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర సుమారు రూ. 30,000 వరకు, 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర సుమారు రూ. 33,000 వరకు ఉండే అవకాశం ఉంది. ఆకర్షణీయమైన డిజైన్, ప్రీమియం రంగుల్లో ఆగస్టు 6న ఈ ఫోన్ లాంచ్ కానుంది.
Also Read
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!