Fielder Clicks Finger Video: క్రికెట్ చరిత్రలోనే వినూత్న చీటింగ్.. వేలితో చిటికేసి బ్యాటర్‌ను అవుట్ చేశాడు.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లీష్ క్లబ్ క్రికెట్లో ఒక విచిత్రమైన, వినూత్నమైన మోసం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా క్రికెట్ మైదానంలో బాల్ టాంపరింగ్, ఫేక్ ఫీల్డింగ్ వంటి వివాదాలు చూస్తుంటాం, కానీ ఈసారి ఒక ఫీల్డర్ ‘ఫేక్-ఎడ్జ్’ ద్వారా అంపైర్‌ను బురిడీ కొట్టించి బ్యాటర్‌ను అవుట్ చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో పాటు పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది.
ఈ ఘటన ‘నార్త్ యార్క్‌షైర్ అండ్ సౌత్ డర్హామ్ క్రికెట్ లీగ్’ డివిజన్-2 లో భాగమైన సాల్ట్‌బర్న్ క్రికెట్ క్లబ్, మిడిల్స్‌బ్రో సెకండ్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది. మ్యాచ్ సమయంలో బ్యాటర్ బంతిని ఆడేందుకు ప్రయత్నించగా, బంతి బ్యాట్‌కు తగలకుండానే వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే.. ఫస్ట్ స్లిప్‌లో నిలబడిన సాల్ట్‌బర్న్ ఫీల్డర్ సరిగ్గా బంతి బ్యాట్‌ను దాటే సమయంలో తన వేళ్లతో బిగ్గరగా చిటికె వేశాడు. ఆ శబ్దాన్ని బంతి బ్యాట్ అంచుకు తగిలిన శబ్దంగా భావించిన అంపైర్ బ్యాటర్‌ను అవుట్‌గా ప్రకటించాడు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
మిడిల్స్‌బ్రో సెకండ్ ఎలెవన్ కెప్టెన్ రోరీ కాటరిల్ ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ మ్యాచ్‌లో సాల్ట్‌బర్న్ జట్టు 29 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ, మ్యాచ్ సమయంలో 15, 16 సంవత్సరాల వయస్సున్న యువ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఫేక్-ఎడ్జ్ మోసాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఒకే మ్యాచ్‌లో దాదాపు మూడుసార్లు ఇలాంటి ఘటనలు జరిగాయని, నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న తనకు మొదట్లో ఏం జరిగిందో అర్థం కాలేదని తెలిపారు. ఆ తర్వాత ఇతర మ్యాచ్‌ల వీడియోలు కూడా బయటకు రావడంతో వివాదం మరింత ముదిరింది.
Boro 2s skippa here, was 2 more incidents during this game, leading to a 15 and 16 year old being cheated out of an innings, along with this one. I was at the non strikers end at the time unknowingly watching them cheat in real time. We lost this game by 29 runs. Shocking. pic.twitter.com/BTTngKbjw3
— rory99 (@rorycotters9) July 27, 2026
ఈ ఆరోపణలపై నార్త్ యార్క్‌షైర్ అండ్ సౌత్ డర్హామ్ క్రికెట్ లీగ్ నిర్వాహకులు స్పందించారు. ఈ ఘటనపై అధికారికంగా ఫిర్యాదు అందిందని, దీనిపై సమగ్ర విచారణ ప్రారంభించామని ధృవీకరించారు. విచారణ పూర్తయి, పూర్తి స్థాయి నివేదిక వచ్చేంత వరకు ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని లీగ్ కమిటీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ మోసం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!