కృష్ణాజిల్లా గుడివాడలో మరోసారి ప్రత్యక్షమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని.. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి ఈ మధ్యే గుడివాడలో కనిపించిన ఆయన.. ఈ రోజు గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.. ముందస్తు బెయిల్‌లో భాగంగా కోర్టు షరతుల మేరకు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేశారు కొడాలి నాని..
వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మిల్స్ కాలనీ ఇన్స్‌పెక్టర్ జూపల్లి వెంకటరత్నం సస్పెండ్ అయ్యారు. ఆయన మీద వేటు వేస్తూ... వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. డిపార్ట్‌మెంట్‌లో అలాంటివి సాధారణంగా జరుగుతుంటాయి. కానీ, ఈ సస్పెన్షన్ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే.. ఈ పోలీస్ స్టేషన్ ఇలాంటివి కామన్ అయిపోయాయి కాబట్టి.
తమిళనాడులోని ఓ పోలీస్ స్టేషన్‌కు విశిష్ట అతిథి వచ్చింది. ఏ వీఐపీనో... సెలబ్రిటీనో కాదు. ఎన్నడూ పోలీస్ వాళ్లు కూడా చూడని అతిథి రావడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
జనసేన పార్టీ అధినేత మరియు ఏపీ డిప్యూట్ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని దువ్వాడపై ఫైర్ అవుతోన్న భీమవరం జనసైనికులు.. జనసేన నేత కునా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్‌పోర్ట్ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఔట్ పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఔట్ పోస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీపీ అవినాష్ మహంతి, ఎయిర్‌పోర్ట్ సీఈఓ ప్రదీప్ ఫనికర్, సీఐఎస్ఎఫ్‌డీజి మొహంక్య తదితరులు పాల్గొన్నారు.
Blast: పంజాబ్ రాష్ట్రంలో పేలుడు కలకలం రేపుతుంది. అమృత్‌సర్‌లోని పోలీస్‌స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. 2018లో అప్పటి హోం మంత్రి చిన్నరాజప్ప చేతులు మీద భూమి పూజ జరిగిన అరిలోవా పోలీస్ స్టేషన్‌ను ఈ రోజు కూటమి ప్రభుత్వమే ప్రారంభించిందన్నారు. విశాఖలో రోడ్డు యాక్సిడెంట్ బాధితుల సహకార కేంద్రం ప్రారంభించామన్నారు.
ప్రస్తుతం ఎంతో మంది తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు ఆరాటపడుతున్నారు. అందుకోసం ప్రమాదకర స్టంట్‌లు చేస్తూ.. లైకుల కోసం ప్రాణాలకు తెగిస్తున్నారు. ఫాలోవర్స్ మోజులో కొందరు యువకులు డేంజరస్ స్టంట్స్ చేస్తున్నారు. ప్రాణాలతో చెలగాడం ఆడుతున్నారు.