Tamil Nadu: పోలీస్‌స్టేషన్‌కు స్పెషల్ గెస్ట్.. కలియ తిరిగి ఏం చేసిందంటే..!
- పోలీస్‌స్టేషన్‌కు స్పెషల్ గెస్ట్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులోని ఓ పోలీస్ స్టేషన్‌కు విశిష్ట అతిథి వచ్చింది. ఏ వీఐపీనో… సెలబ్రిటీనో కాదు. ఎన్నడూ పోలీస్ వాళ్లు కూడా చూడని అతిథి రావడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు.. సోషల్ మీడియా వేదికగా సెటైర్లు కూడా పేలుతున్నాయి. అసలు ఆ అతిథి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా గూడలూరు-ఊటీ జాతీయ రాహదారిపై ఉన్న పోలీస్ స్టేషన్. సోమవారం రాత్రి 8:30 గంటల సమయం. ఉన్నట్టుండి.. ఒక చిరుత పులి మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చింది. గదిలో కాసేపు కలియ తిరిగింది. ఎవరూ కనిపించలేదు. పైగా భోజనం కూడా దొరకలేదు. ఇక చేసేదేమీలేక.. వచ్చిన దారిలోనే తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. ఇక చిరుత పులి లోపలికి వచ్చినప్పుడు.. పక్క గదిలోనే ఓ కానిస్టేబుల్ ఉన్నాడు. చిరుత లోపలికి రావడం చూసి కిమ్మనకుండా మౌనంగా ఉన్నాడు. అది బయటకు వెళ్లిపోగానే తలుపు మూసేసి.. హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ఇది కూడా చదవండి: Canada: విషాదం.. భారతీయ విద్యార్థిని అనుమానాస్పద మృతి
చిరుత పులి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సెటైర్లు పేలుతున్నాయి. ప్రియురాలు మిస్ అయిందంటూ చిరుత కంప్లంట్ ఇచ్చేందుకు వచ్చిందంటూ కామెంట్ చేశారు. మనుషులు వచ్చినా.. జంతువులు వచ్చినా పోలీసు వాళ్లు పట్టించుకోరంటూ ఇంకొందరు కామెంట్లు చేశారు. కంప్లంట్ చేసేందుకు వస్తే.. ఎవరూ లేరంటూ ఆవేదనతో చిరుత వెనక్కి వెళ్లిపోయిందంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇలా నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు.
వాస్తవంగా వేసవి కాలంలో అడవుల్లో నీళ్లు దొరకవు. అలాగే ఆహారం కూడా లభించదు. దీంతో అడవి మృగాలు.. ఆహారం కోసం జనావాసాల మధ్యకు వచ్చేస్తుంటాయి. ఆ విధంగానే చిరుత వచ్చినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఇక చిరుత సమాచారాన్ని పోలీసులు.. ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు. రంగంలోకి దిగిన అధికారులు.. చిరుత కోసం జల్లెడ పడుతున్నారు.
ఇది కూడా చదవండి: AakankshaSingh : హాట్ ఫోజులతో కాంక్ష రేపుతున్న ఆకాంక్షసింగ్
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు