Jana Sena: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు జనసేన పార్టీ నేతలు.. తాజాగా మరో పీఎస్‌లో ఫిర్యాదు అందింది.. జనసేన పార్టీ అధినేత మరియు ఏపీ డిప్యూట్ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని దువ్వాడపై ఫైర్ అవుతోన్న భీమవరం జనసైనికులు.. జనసేన నేత కునా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దువ్వాడ శ్రీను ఈ మధ్యకాలంలో అనేక సందర్భలాలో పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.. పెయిడ్ ఆర్టిస్ట్, ఫ్యాకేజ్ స్టార్ , క్యారక్టర్ లేని వాడు అనేకాకుండా.. వ్యక్తిగత దూషణలు చేశారు.. ఒక బాధ్యతాయుత పదవిలో వుండి పవన్ కల్యాణ్‌పై అవమానకరమైన, అనుచిత వ్యాఖ్యలతో ఇబ్బంది పెడుతూ అవమానించారు. కూటమి ప్రభుత్వం దగ్గర, సీఎం చంద్రబాబు దగ్గర నెలకు 50 కోట్ల రూపాయలు తీసుకున్నారని నిరాధారమైన ఆరోపణలు చేశారు.. అది నిరూపించాలని దానికి సంబంధించిన సాక్ష్యాలు చూపాలని.. లేని యెడల చట్టరీత్య శిక్షలకు సిద్ధం కావాలని హెచ్చరించారు.. అలాగే జనసేన సైనికులను సైకోలంటూ.. పార్టీ కార్యకర్తలను, వీర మహిళలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి, దేశ భద్రతను భంగం కలిగించే విధంగా మాట్లాడిన వ్యక్తిపై తగు చర్యలు తీసుకోవాలని.. శాంతి భద్రతలను కాపాడాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు జనసేన నేతలు..
Read Also: Liquor Sales: మద్యం అమ్మకాల వ్యవహారంపై మండలిలో రచ్చ.. కొల్లు రవీంధ్ర కామెంట్లతో..