Kodali Nani: కృష్ణాజిల్లా గుడివాడలో మరోసారి ప్రత్యక్షమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని.. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి ఈ మధ్యే గుడివాడలో కనిపించిన ఆయన.. ఈ రోజు గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.. ముందస్తు బెయిల్‌లో భాగంగా కోర్టు షరతుల మేరకు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేశారు కొడాలి నాని.. అయతే, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో కొడాలి నానికి గుడివాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే కాగా.. ఆ షరతుల్లో భాగంగానే ఈ రోజు పీఎస్‌కు వచ్చి సంతకాలు చేశారు కొడాలి నాని..
Read Also: CM Revanth Reddy: న్యాయమంటే కేవలం శిక్షలు విధించడమే కాదు.. బాధితుల జీవితానికి భరోసా కల్పించాలి..
కాగా, మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొడాలి నానిపై రకరకాల ప్రచారాలు సాగాయి.. చివరకు ఆయన్ను అరెస్ట్ చేశారని.. రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారనే పుకార్లు కూడా షికార్లు చేశాయి.. దాంట్లో నిజం లేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.. అయితే, సుదీర్ఘ విరామం తర్వాత ఈ మధ్యే గుడివాడలో ప్రత్యక్షమయ్యారు మాజీ మంత్రి కొడాలి నాని.. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి ఘటనలో కొడాలి నానిపై కేసు నమోదు కాగా.. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు కొడాలి నాని.. అయితే, కింద కోర్టులో బెయిల్ తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో.. ష్యూరిటీ పత్రాలు సమర్పించేందుకు గుడివాడ కోర్టుకు హాజరైన ఆయన.. ఈ రోజు గుడివాడ వన్ టౌన్ పీఎస్‌లో వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోయారు..