నీతోనే ప్రేమ.. నీవే నా సర్వస్వం అంటూ తిరిగాడు. చివరాఖరికి పెళ్లి మాటెత్తితే ముఖం చాటేశాడు. ఓ ప్రేమికుడి మోసానికి బలయిన యువతి అతని ఇంటిముందే నిరసనకు దిగింది. రంగారెడ్డి జిల్లా పరిగి మండలం చిట్యాల గ్రామంలో ప్రియుడి ఇంటిముందు బైఠాయించింది ఆ యువతి. యువతితో నిశ్చితార్థం చేసుకొని మరో యువతిని ప్రేమ పెళ్ళి చేసుకున్నాడు శ్రీకాంత్ అనే యువకుడు. న్యాయం చేయాలంటూ యవకుడి ఇంటిముందు నిరసన తెలుపుతోంది యువతి. ప్రేమ పేరుతో తనను శారీరకంగా వాడుకొని…
వినూత్న నిర్ణయాలతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దూసుకెళ్తున్నారు.. ఇప్పటికే ఆయన తీసుకున్న పలు నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది.. నెటిజన్లు ఆయనను ఆకాశానికి ఎత్తుతున్నారు.. మరో వైపు.. అసెంబ్లీలో తనను పొడిగేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలకు కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం చర్చగా మారింది. ఇక, అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌లో అడుగుపెట్టారు సీఎం స్టాలిన్.. నిన్న ఆర్ధరాత్రి సమయంలో సేలం నుంచి ధర్మపురికి వెళ్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్… అధ్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు.. దీంతో.. పోలీసులంతా…
అక్కడ పోస్టింగ్ కోసం బాగా సమర్పించుకుంటారు. పోస్టింగ్ వచ్చాక తమకు సమర్పించుకునే వాళ్లకోసం వెతుకుతారు. తప్పో ఒప్పో అక్కడికి వెళ్లారా సీన్ సితారే. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఏసీబీ దాడులు చేస్తున్నా సిబ్బందిలో మార్పు లేదు! ఏసీబీకి దొరికినా.. ఎవరు ఆరోపణలు చేసినా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్ స్టాఫ్ తీరు అస్సలు మారడం లేదు. అదే స్టేషన్లో పదే పదే సిబ్బంది ఏసీబీ వలకు చిక్కుతున్నా తర్వాత వచ్చేవారిలోనూ మార్పు రావట్లేదు. ఏజెన్సీ ముఖద్వారంలో…
కరీంనగర్ జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట సానిటీజర్ తాగి వివాహిత దివ్య ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆమెను అడ్డుకున్న కుటుంబ సభ్యులు… పోలీస్ వాహనం లో హాస్పిటల్ కు తరలించారు. భర్త పై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆందోళన చేస్తుంది. బాధితురాలికి తెలియకుండా మరో వివాహం చేసుకున్నాడు భర్త మురళీ కృష్ణ. 2007లో దివ్యకు తెలియకుండా సుజాతను వివాహం చేసుకున్నాడు మురళి కృష్ణ. 2017లో దివ్యను రెండో వివాహం చేసుకుని…
జగిత్యాల జిల్లాలో ఓ ప్రేమికుడు పెట్రోల్ బాటిల్‌తో పోలీస్ స్టేషన్ ముందు హల్‌చల్ చేశాడు. ఒంటిపై పెట్రోలు పోసుకుని దగ్గరకు వస్తే నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడుతానని హెచ్చరించాడు. అరగంటపాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. కరీంనగర్‌కు చెందిన యువతిని ప్రేమిస్తే ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారనిని ఆందోళన వ్యక్తం చేశాడు. జగిత్యాలకు చెందిన వెంకటరమణ ప్రేమ పేరుతో తమ కూతురును వేధిస్తున్నాడని యువతి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వెంకటరమణను…
ఓవైపు ట్విట్టర్, భారత ప్రభుత్వం మధ్య వార్ కొనసాగుతూనే ఉంది.. మరోవైపు.. తాజాగా ట్విట్టర్ ఇండియాకు లీగల్ నోటీసులు పంపించారు ఉత్తరప్రదేశ్ పోలీసులు.. ఇటీవల యూపీలోని ఘజియాబాద్‌లో ముస్లిం వ్యక్తిపై దాడి ఘటనలో మతపరమైన అశాంతిని రెచ్చగొట్టినందుకు ఈ నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.. సూఫీ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి తనపై దాడి చేసిన ముఠా.. వందేమాతరం, జై శ్రీరాం.. నినాదాలు చేశారని ఆరోపించగా.. ఈ ఘటనలో మతపరమైంది ఏమీ లేదని యూపీ పోలీసులు…
సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ లోనే ఇద్దరు వ్యక్తులు కానిస్టేబుల్ పై దాడి చేసారు. ఓ కేసులో ఇద్దరు నిందితులను విచారణ కై పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చిన పోలీసులు… విచారిస్తున్న సమయంలో ఒక్కసారిగా కానిస్టేబుల్ కిరణ్ పై దాడికి పాల్పడ్డారు. గాయపడ్డ కానిస్టేబుల్ కిరణ్ ను వెంటనే వైద్యం నిమిత్తం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. గాయపడ్డ కానిస్టేబుల్ తలపై ఆరు కుట్లు పడటంతో ప్రస్తుతం అక్కడే వైద్యం తీసుకుంటున్నాడు. ఈ ఘటనపై…