Indore: నలుగురు యువకుల అరాచకం.. ఎస్సైపై దాడి (వీడియో వైరల్)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indore: ఇండోర్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాణగంగ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై తెరేశ్వర్ ఇక్కాపై మంగళవారం తెల్లవారుజామున నాలుగు మంది యువకులు దాడి చేశారు. ఈ సంఘటన అరవిందో ఆసుపత్రి సమీపంలో ఉదయం 5 గంటల సమయంలో జరిగింది. ఈ ఘటనలో ఎస్సైను దారుణంగా కొట్టి, బలవంతంగా క్షమాపణ చెప్పించడమే కాకుండా.. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
Also Read: Priyanka Chopra : ప్రియాంక చోప్రా లేటెస్ట్ ఫోటోస్.. ఇవి చాలా హాట్ గురూ
Also Read
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
పోలీసుల ప్రకారం, నిందితుల్లో ఒకరు జోబట్ జైలులో పనిచేస్తున్నారు. అయితే ఆయన జైలులో ఏ స్థాయిలో పనిచేస్తున్నారన్న విషయంపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఘటన జరిగిన వెంటనే ఎస్సై తెరేశ్వర్ ఇక్కాను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. వాహన నంబర్ ఆధారంగా ప్రధాన నిందితుడు వికాస్, అతని సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం నిందితులు తాగిన మత్తులో ఉన్నారు. వికాస్, అతని ముగ్గురు సహచరులు తమ థార్ జీపులో మద్యం సేవిస్తున్న సమయంలో ఎస్సై తెరేశ్వర్ వారిని ఆపి ప్రశ్నించారు. దీంతో యువకులు నోటి దురుసుగా మాట్లాడి, తీవ్రంగా విభేదించారు. నిందితులు ఎస్సై బ్యాడ్జ్, వైర్‌లెస్ సెట్ లాక్కుని దాడి చేయడమే కాకుండా, బలవంతంగా తమ జీపులో ఎక్కించి కూలీల సమక్షంలో క్షమాపణలు చెప్పించారు. అంతేకాకుండా ఎస్సైపై అవినీతి ఆరోపణలు చేస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ దాడి సమయంలో ఎస్సై తెరేశ్వర్ పలు సార్లు వైర్‌లెస్ ద్వారా సహాయం కోరినా ఎవరూ స్పందించలేదు. రోడ్డుపై వెళ్లే ప్రయాణీకులు ఈ ఘటనను చూసి నిలబడినా, ఎవరూ ముందుకు వచ్చి సహాయం చేయలేదు.
इंदौर का ये वीडियो सोशल मीडिया पर खूब वायरल हो रहा है जिसमें एक दारोगा का ड्यूटी के दौरान अपहरण और फिर पिटाई ,इंदौर में सड़क पर शराब पी रहे लड़को को चौकी इंचार्ज ने टोका तो चौकी इंचार्ज को उठा ले गए लड़के और अनजान जगह ले जाकर पीटा pic.twitter.com/LKxLvUcT9e
— Anuj chaudharyy ..Newsपोस्ट (@anujchnewspost) February 6, 2025
ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి ప్రధాన నిందితుడు వికాస్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. నిందితులపై ప్రభుత్వ విధులకు ఆటంకం కల్పించడం, దాడి, దౌర్జన్యానికి సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేయడమే కాకుండా.. సామాజిక బాధ్యతకూ దృష్టి నిలిపింది.
తాజావార్తలు
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ట్రెండింగ్
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!