Hyderabad: హైదరాబాద్‌లోని పంజాగుట్టలో పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర్ హత్య ఘటన నగరాన్ని తీవ్ర కుదిపేసింది. కుటుంబ ఆస్తుల కోసం జరిగిన ఈ హత్యలో చంద్రశేఖర్ సొంత మనవడు కీర్తి తేజ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. 73 సార్లు కత్తితో పొడిచి తన తాతను హతమార్చిన కీర్తి తేజ, తండ్రి లేని కుటుంబంలో తాత ఇతర మనవళ్లను చూసినట్లుగా తనను చూడలేదని భావించి ఈ హత్యకు పాల్పిడినట్లు తెలుస్తోంది. వెలమాటి చంద్రశేఖర్ తన కంపెనీలో ఇటీవల ఒక మనవడికి డైరెక్టర్ పదవి ఇవ్వగా, కీర్తి తేజ కూడా అదే పదవిని డిమాండ్ చేశాడు. అమెరికాలో స్థిరపడిన కీర్తి తేజ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. చెడు వ్యసనాలపై మోజు పడిన కీర్తి తేజను చూసి చంద్రశేఖర్ అతనికి డైరెక్టర్ పదవి ఇవ్వడానికి నిరాకరించారు. ఈ నిర్ణయంతో కోపంతో రగిలిపోయిన కీర్తి తేజ, చంద్రశేఖర్‌ను 73 సార్లు కత్తితో పొడిచి చంపాడు.
Also Read: Hyderabad: టోలిచౌకిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. కాల్పుల కలకలం?
తాతను పొడుస్తుండగా అడ్డుకునేందుకు వచ్చిన తల్లిపై 12 సార్లు కత్తితో దాడి చేశాడు. తాత, తల్లి అరుపులు విన్న స్థానికులు ఇంట్లోకి చేరుకోగా, అప్పటికే చంద్రశేఖర్ మృతి చెందగా తీవ్ర గాయాలతో తల్లి బతుకుపై పోరాడుతోంది. తాతను హత్య చేసిన కీర్తి తేజ వెంటనే ఏలూరుకు పారిపోగా, సమాచారం అందుకున్న పోలీసులు అక్కడే అతన్ని అరెస్ట్ చేశారు. కీర్తి తేజ తల్లిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వెలమాటి చంద్రశేఖర్ ప్రముఖ పారిశ్రామికవేత్తగా వెల్జాన్ కంపెనీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఆయన ఇదివరకు టీటీడీకి 40 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చి సేవలు అందించారు. వందల కోట్ల ఆస్తులను కలిగి ఉన్న చంద్రశేఖర్ హత్య కేసు ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉంది. ఈ దారుణ హత్యకు సంబంధించిన వివరాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఆస్తి విషయంలో ఆవేశపడి ఇలాంటి ఘాతుకానికి దిగడం అమానుషం అంటూ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.