Road Accident: నార్సింగ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువ వైద్యుడు ప్రాణాలు కోల్పోగా, మరో వైద్యురాలు తీవ్రంగా గాయపడింది. ప్రమాద సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు ఖానాపూర్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో జస్మిత్ అనే యువ వైద్యుడు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. భూమిక అనే మరో వైద్యురాలు తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈ ఇద్దరు వైద్యులు జన్వాడలో జరిగిన ఓ ఫంక్షన్ కు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
వీరిద్దరూ కామినేని ఆసుపత్రిలో హౌస్ సర్జన్లుగా పని చేస్తున్నారు. భూమిక ఎల్బీనగర్ కు చెందిన వ్యక్తి కాగా, జస్మిత్ బాచుపల్లి కు చెందినవాడిగా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని రేకెత్తించింది. అధిక వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: Jet Fuel Hike : బడ్జెట్ కు ముందు విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. 5శాతం పెరిగిన జెట్ ఫ్యూయెల్ ధర