ప్రేమించిన యువతి ఇంటి ముందు ప్రేమికుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మైలార్దేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్ లింగంపల్లికి చెందిన సోను (21) డిగ్రీ స్టూడెంట్. హౌసింగ్ బోర్డ్ కాలనీ, బృందావనం కాలనీకి చెందిన అంబిక (21) ఎల్ఎల్బీ స్టూడెంట్. ఇద్దరు గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు.
ముంబై నుంచి ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడి మరోల్ ప్రాంతంలో ఒక పిచ్చి ప్రేమికుడు తన మైనర్ ప్రియురాలిని కోపంతో సజీవ దహనం చేయాలని చూశాడు. తాను కూడా నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనే సమాచారం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం వారిద్దరూ ముంబైలోని కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సింగర్ కల్పన మాత్రలు మింగి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. కేబీహెచ్బీ పోలీసులు ఈ కేసు వివరాలు వెల్లడించారు. సింగర్ కల్పన ఎర్నాకుళంలో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. ఆమె నిద్ర పట్టకపోవడంతో జోల్ ఫ్రెష్ నిద్రమాత్రలు వేసుకున్నట్లు వెల్లడించారు. అవి వేసుకున్నా.. నిద్ర రాకపోవడంతో మరో 10 నిద్రమాత్రలు వేసుకొని అపస్మారక స్థితికి వెళ్లినట్లు తెలిపారు.
SBI ATM: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం (మార్చి 2) తెల్లవారు జామున రావిర్యాల గ్రామంలో ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనం జరిగింది. కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత వ్యూహాత్మకంగా దోపిడీ చేశారు. ముందుగా సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి, ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు. అనంతరం గ్యాస్ కట్టర్, ఇనుప రాడ్ల సాయంతో ఏటీఎంను బద్దలు కొట్టారు. ఆ తరవాత కేవలం నాలుగు నిమిషాల్లోనే…
హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఓ టూ వీలర్ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో టూ వీలర్ పై వెళ్తున్న ఒకరు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Sumanth Reddy: వరంగల్లో జరిగిన దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. డాక్టర్ సుమంత్ రెడ్డి తన ప్రాణాలను కోల్పోయిన విషాదకర ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత నెల 20వ తేదీన బట్టుపల్లి సమీపంలో కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఈ దాడి వ్యవహారంలో ఆయన భార్య ఫ్లోరా ప్రధాన ముద్దాయి అని పోలీసుల విచారణలో వెల్లడైంది. దాడిలో తీవ్రంగా గాయపడిన సుమంత్ రెడ్డిని కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఒక…
Wife Harassment: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా డిఫెన్స్ కాలనీకి చెందిన మానవ్ శర్మ (35) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మానవ్ ప్రముఖ ఐటీ కంపెనీలో రిక్రూట్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు, ఆయన ఒక భావోద్వేగ వీడియో రికార్డ్ చేసి అందులో తన భార్యపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ వీడియోలో మానవ్ కన్నీళ్లతో మాట్లాడుతూ.. తన భార్య తనను తీవ్రంగా వేధించిందని, ఆమె నడవడికపై తనకు అనుమానం వచ్చిందని తెలిపారు. అంతేకాకుండా, ఆమె తనతో…
GHMC : లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంగర్ హౌస్ హుడా పార్క్ చెరువు శుభ్రం చేసే క్రమంలో తండ్రి కొడుకుల మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. లంగర్ హౌస్ లోని హుడా పార్క్ చెరువులో చెరువు శుభ్రం చేసే ఔట్సోర్సింగ్ సిబ్బంది మహమ్మద్ కరీం (38 ) ఈరోజు శివరాత్రి సందర్భంగా స్కూలుకి సెలవు ఉండడం వల్ల తన కొడుకు సాహిల్ (15)ను తనతో పాటు తీసుకువచ్చాడు. ఈరోజు మధ్యాహ్నం సుమారు…
Hyderabad: హైదరాబాద్ నగరంలోని రామంతాపూర్లో మనీషా (22) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఏడాది క్రితం సంపత్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న మనీషా, ప్రస్తుతం రామంతాపూర్లో అద్దె ఇంట్లో నివసిస్తోంది. అయితే గత రాత్రి ఆమె అనుమానాస్పదంగా మరణించడం కుటుంబ సభ్యులను, స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. Read Also: Yadagirigutta: ఘనంగా జరగనున్న బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేకం.. పాల్గొననున్న సీఎం మనీషా…
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో జరిగిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగ మూర్తి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. రాజలింగ మూర్తి భార్య సరళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో 4 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు.