Blast : హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చెత్తను తొలగించే క్రమంలో గుర్తు తెలియని కెమికల్ పేలుడు సంభవించి ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్నది. కుషాయిగూడలోని స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ ఏరియాలో సాడక్ నాగరాజు అనే కార్మికుడు చెత్తను తొలగించే పనిలో ఉన్నాడు. పని చేస్తున్న సమయంలో, చెత్తలో మిళితమైన కొన్ని కెమికల్స్ ఆకస్మాత్తుగా పేలడంతో నాగరాజుకు తీవ్ర గాయాలు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం న్యూ గొల్లగూడెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తుకు బానిసై డబ్బులు ఇవ్వమని వేధిస్తున్న కొడుకును, తల్లే హత్య చేసిన సంఘటన కలకలం రేపుతోంది. కొడుకు రాజ్ కుమార్ వేధింపులు తట్టుకోలేక తల్లి దూడమ్మ సంచలన నిర్ణయం తీసుకుంది. కొడుకును కాళ్లు కట్టేసి, కొట్టి ఉరివేసి హత్య చేసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి ఆధ్వర్యంలో విచారణ…
మియాపూర్ బెట్టింగ్ యాప్స్ కేసుల వివరాలు సేకరిస్తున్నామని మాదాపూర్ డీసీపీ వినీత్ అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ముందుగా యాప్స్ నిర్వహకులకు నోటీసులు పంపి వారి వివరణ తీసుకున్నాక దర్యాప్తు ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో పాన్ ఇండియా స్టార్స్ ఉన్న నేపథ్యంలో లీగల్ పరిణామాలను కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. మోరల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా సినీ సెలబ్రిటీలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని మియాపూర్ పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తామన్నారు.
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంపై స్పందించారు. తన పేరు ప్రస్తుతం చర్చకు వస్తుండటంపై ఆయన వివరణ ఇచ్చారు. ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా వీడియోను విడుదల చేసిన ఆయన, గతంలో తాను ఓ గేమింగ్ యాప్ యాడ్ చేసిన విషయాన్ని అంగీకరించారు. అయితే, ఆ ప్రకటనను చేయడం తప్పుడు నిర్ణయమని తెలుసుకుని, తానే స్వయంగా ఒప్పందాన్ని పొడిగించకుండా నిష్క్రమించానని స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో మరోసారి హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. నార్సింగిలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో యువ ఇంజనీర్ నవీన్ చారీ ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో ఆసక్తితో, ఆశలతో తన మొదటి ఉద్యోగం ప్రారంభించిన నవీన్ చారీ ఆ రోజు పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది. కోకాపేట్ టీ-గ్రీల్ వద్ద నవీన్ చారీ తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం అతడిని వేగంగా ఢీకొట్టింది.…
ఇంటి ముందు నిద్రిస్తున్న కొడుకును ఇనుప రాడ్డుతో కొట్టి హత్యకు ఒడిగట్టింది తల్లి హత్యకు భార్య కూడా సహకరించడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. మొదట అనుమానాస్పద మృతిగా వందతులు వచ్చినా.. దారుణ హత్య చేశారని పుకార్లు వినిపించాయి. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం హన్మాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బక్కని వెంకటేష్ వ్యవసాయం చేస్తూ జీవించేవాడు. తల్లి భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేవాడు. మంగళవారం రాత్రి ఇంటి…
Shocking Incident : తెలంగాణలో మానవత్వం మంటగలిసే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహితురాలిపై నమ్మకాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకుంటూ, హృదయ విదారకమైన పాశవిక చర్యకు పాల్పడిన సంఘటన కలకలం రేపుతోంది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన రోజా అనే యువతి తన స్నేహితురాలిని (26) ఇంటికి ఆహ్వానించి ఘోర మోసానికి పాల్పడింది. మద్యం తాగించి, ఆమెను మత్తులోకి నెట్టివేస్తూ, తన ప్రియుడు ప్రమోద్ చేత ఆమెపై అత్యాచారం చేయించింది. అంతేకాదు, ఈ దారుణ ఘటనను వీడియో…
చాలా మందికి.. ఇంట్లో చేసినవి కంటే.. బయట ఆహారాల మీదనే ఇంట్రస్ట్ ఉంటుంది. అవే రుచిగా ఉంటాయి కదా..! కానీ వాటిని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? మేకింగ్ ఎందుకు ఈటింగ్ మాత్రమే మాకు కావాలి అంటారా? ఈ వార్త వింటే చూసిన తర్వాత బయట ఫుడ్పై మీరు విసుగుచెందుతారు. వాస్తవానికి.. పంజాబ్ రాష్ట్రం మొహాలీ జిల్లా మాటౌర్ గ్రామంలో అక్రమ మోమో, స్ప్రింగ్ రోల్ తయారీ యూనిట్పై మున్సిపల్ కార్పొరేషన్ వైద్య బృందం…
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి ఆ నేరాన్ని రోడ్డు ప్రమాదంగా చూపించడానికి ఆమె మృతదేహాన్ని వీధిలో వదిలివెళ్లాడు.
ఏపీలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి తన కుమారులను దారుణంగా చంపేశాడు. అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఇద్దరు కుమారుల కాళ్లూ చేతులను తాళ్లతో కట్టేసి, నీళ్ల బకెట్లలో తలలు ముంచేశాడు. ఊపిరాడక కొట్టుమిట్టాడుతూ.. ఇద్దరు బాలురు తుది శ్వాస వదిలారు. ఈ ఘటన అనంతరం ఆ తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, సొంతిల్లు, మంచి కుటుంబం ఉన్నా, ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరని అందుకే చంపేసి…