ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మీరట్ కు చెందిన ముస్కాన్ కేసు ఇంకా చల్లార లేదు. తాజాగా ముజఫర్ నగర్ నుంచి మరో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ రెండేళ్ల క్రితమే వివాహమైన పింకీ అనే మహిళ తన భర్తను చంపడానికి ప్రయత్నించింది. కాఫీలో విషం కలిపి భర్తను చంపడానికి ఆమె కుట్ర పన్నింది. ఈ సంచలనాత్మక కేసులో బాధితుడి సోదరి ఫిర్యాదు మేరకు.. పోలీసులు పింకీపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE: Vice MPP Election: దంపతుల మధ్య చిచ్చు పెట్టిన వైస్ ఎంపీపీ ఎన్నిక.. పుట్టింటికి వెళ్లిపోయిన భార్య..!
ముజఫర్‌నగర్ జిల్లా ఖతౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని భయాంగి గ్రామానికి చెందిన 26 ఏళ్ల అనుజ్ శర్మ, రెండేళ్ల క్రితం ఘజియాబాద్‌లోని లోని పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన పింకీ శర్మ అలియాస్ సన్నోను వివాహం చేసుకున్నాడు. అనుజ్ మీరట్‌లోని ఒక ఆసుపత్రిలో పనిచేసేవాడు. పెళ్లైన కొన్ని నెలలకే పింకీ, అనుజ్ మధ్య గొడవలు మొదలయ్యాయి. పింకీ వేరొకరితో మాట్లాడుతోందని అనుజ్ అనుమానించాడు. అనుజ్ పింకీకి నచ్చజెప్పడానికి చాలా సార్లు ప్రయత్నించాడు. మార్చి 25 సాయంత్రం పింకీ అనుజ్ కాఫీలో విషం కలిపి చంపడానికి ప్రయత్నించింది. కాఫీ తాగిన తర్వాత అనుజ్ ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం బాధితుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
READ MORE:Vice MPP Election: దంపతుల మధ్య చిచ్చు పెట్టిన వైస్ ఎంపీపీ ఎన్నిక.. పుట్టింటికి వెళ్లిపోయిన భార్య..!
ఈ అంశంపై అనుజ్ సోదరి మీనాక్షి మాట్లాడుతూ.. “నా తమ్ముడు పనికి వెళ్ళినప్పుడు.. పింకీ తన ప్రియుడితో గంటల తరబడి మొబైల్‌లో మాట్లాడేది. రోజు రోజుకూ పరిస్థితి దిగజారింది. ఇటీవల.. అనుజ్ దాడి చేసినట్లు పింకీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఒకరోజు అనుజ్ పింకీ మొబైల్ లాక్కుని తన ప్రియుడి సందేశాలు, ఫోటోలను చూశాడు. ఆ ప్రేమికుడు మరెవరో కాదు, పింకీ బంధువు. నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. అనంతరం మార్చి 25 సాయంత్రం.. పింకీ అనుజ్ కాఫీలో విషం కలిపి చంపడానికి ప్రయత్నించింది. కాఫీ తాగిన తర్వాత అనుజ్ ఆరోగ్యం క్షీణించింది. అతన్ని మీరట్ ఆసుపత్రిలో చేర్చాం. వైద్యులు అతన్ని ఐసీయులో ఉంచారు. పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.” అని మీనాక్షి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఓ ఖతౌలి రామశిష్ యాదవ్ తెలిపారు.