Gun Fire : హైదరాబాద్, గుడిమల్కాపూర్‌లోని కింగ్స్ ప్యాలెస్‌లో నిర్వహించిన ఆనం మీర్జా ఎక్స్పోలో కాల్పుల కలకం చోటుచేసుకుంది. ఎక్స్పోలో ఇద్దరు షాప్ కీపర్‌ల మధ్య వాగ్వాదం తలెత్తి తీవ్ర స్థాయికి చేరుకుంది. తీవ్ర వాగ్వాదం అనంతరం, వారిలో ఒకరు గాలిలో కాల్పులు జరపడంతో అక్కడున్న వారిలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. కాల్పుల శబ్దంతో సందడి నెలకొనగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గాలిలో కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఎక్స్పో నిర్వాహకులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఎక్స్పో ప్రాంతంలో భద్రతను పెంచినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనతో ఎక్స్పోకు వచ్చిన ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే, పోలీసులు వెంటనే స్పందించడంతో పరిస్ధితి అదుపులోకి వచ్చిందని అక్కడి స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై ఇంకా వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది.
Bengaluru: “ఇది పక్కా ప్లాన్” భార్యను ముక్కలు, ముక్కులుగా నరికిన కేసులో ట్విస్ట్..