నవ మాసాలు మోసి కన్న బిడ్డను తన చేతులతో కడతేర్చింది. మైలార్ దేవ్ పల్లి ఆలీ నగర్ లో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 15 రోజుల పసికందుని తల్లి చంపేసింది. పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపి ప్రమాదవశాత్తుగా క్రియేట్ చేసింది. స్నానం చేసి వచ్చేసరికి బకెట్లో పసికందు పడిపోయిందని నాటకమాడింది. 14 రోజుల పసికందుని తల్లి చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఆర్థిక సమస్యలతోనే పసికందుని చంపినట్లుగా గుర్తించారు. భర్తకు రెండు కిడ్నీలు చెడిపోవడం, కుటుంబ పోషణ భారంగా మారడంతో పసికందు హత్య చేసింది. ఈ మనీ, విజ్జు దంపతులు తమిళనాడుకు చెందిన వాళ్లు.
READ MORE: Sangareddy: ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన తల్లి.. తానూ ఆత్మహత్యాయత్నం..
పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ వచ్చారు. ఆమె కాటేదాన్ లోని ఓ పరిశ్రమలో కార్మికులుగా పని చేస్తోంది. భర్తకు చికిత్స చేయించ లేక, కుటుంబం పోషించ లేక తల్లడిల్లింది భార్య విజ్జి. భర్త మణికి డయాలిసీస్ చేసుకోవడం, అప్పుడే పండండి బిడ్డకు జన్మనివ్వడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఏమి చేయాలో తోచక కన్న పేగును హతమార్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
READ MORE: CSK vs RCB: చెన్నైతో బెంగళూరు ఢీ.. 17 ఏళ్ల నుంచి ఆర్సీబీకి విజయమే లేదు!