Online Betting: కామారెడ్డిలో బెట్టింగ్ మోజు ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఆన్లైన్ బెట్టింగ్లో 80 లక్షలకుపైగా కోల్పోయి అప్పుల బాధలో మునిగిపోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సంజయ్ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. భార్య శ్రీలత కన్నీరుమున్నీరవుతూ.. అప్పుల బాధల వల్లే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, బెట్టింగ్ యాప్లను తక్షణమే నిషేధించాలని కోరింది. అలాగే, ఎవరైనా అప్పు ఇచ్చే ముందు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి అంటూ వాపోయింది.…
Punjagutta Murder Case: హైదరాబాద్ పంజాగుట్టలో వ్యాపారవేత్త జనార్ధన్ రావు హత్య కేసులో అతని మనవడు కీర్తితేజ పోలీస్ కస్టడీ ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన విచారణలో అతను తాతను హత్య చేసిన వివరాలను వెల్లడించాడు. కస్టడీ మొదటి రోజు పోలీసుల ప్రశ్నలకు కీర్తితేజ సమాధానం ఇవ్వకుండా మౌనం వహించాడు. ఎంత కదిలించినా అతను స్పందించలేదు. హత్య జరిగిన స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నించినా పూర్తిగా సహకరించలేదు. అయితే, రెండో రోజు విచారణలో…
Murder : మేడ్చల్లో వరుస హత్య కలకలం రేపుతున్నాయి. నిన్న మేడ్చల్ పట్టణంలోని బస్ డిపో ఎదుట 44వ నెంబర్ జాతీయ రహదారిపై దారుణ హత్య చోటు చేసుకుంది. మేడ్చల్ బస్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న గన్యా కుమారుడు ఉమేష్(30) ను ఆయన చిన్న కుమారుడు మరో వ్యక్తితో కలిసి హత్య చేశాడు. అయితే.. కుటుంబ కలహాల కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. మద్యానికి బానిసై కుటుంబ సభ్యులపై వేధింపులకు పాల్పడుతుండడంపై విసిగిపోయిన…
Karnataka : డబ్బు, మహిళ, భూమి అనే మూడింటి కోసం ప్రతి మనిషి ఏదైనా చేస్తాడని అంటుంటారు. అది కూడా నిజమే. కర్ణాటక నుండి ఈ మూడు విషయాలకు సంబంధిన ఓ కేసు వెలుగులోకి వచ్చింది.
Fake Certificates: గద్వాల జిల్లా వ్యవసాయ శాఖలో నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారం సంచలనం సృష్టించింది. ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన పలువురు అసిస్టెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు (AEO) అధికారుల గుట్టు బయటపడింది. వీరు ఉత్తరప్రదేశ్లో వ్యవసాయ విద్యను అభ్యసించినట్లు దొంగ డిగ్రీలు సృష్టించుకుని ఉద్యోగాల్లో చేరినట్లు గుర్తించారు. ఈ నకిలీ సర్టిఫికేట్ వ్యవహారంపై అధికారికంగా విచారణ జరుగుతోంది. ఇప్పటివరకు ఏడుగురు ఉద్యోగుల నకిలీ డిగ్రీలపై అధికారులు దృష్టి సారించి విచారణ చేపట్టారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో ఎలాంటి…
SangaReddy: సంగారెడ్డి జిలా నిజాంపేట మండలం ఈదులతండా శివారులో ఘోరమైన హత్య ఘటన చోటుచేసుకుంది. కూతురిని ప్రేమిస్తున్నాడనే కారణంతో ఓ తండ్రి యువకుడిని పాశవికంగా హత్య చేసి అతని శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసిన ఘటన చోటు చేసుకుంది. నిజాంపేట మండలానికి చెందిన దశరథ్ (26) హత్యకు గురైన బాధితుడు. అతను నిందితుడు గోపాల్ కుమార్తెతో సన్నిహితంగా ఉండటాన్ని గోపాల్ సహించలేకపోయాడు. దీంతో అతనిపై కోపంతో దాడి చేసి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి అటవీ…
Phone Tapping: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు, రాధా కిషన్ రావు పేర్లు ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఫోన్ టాపింగ్ తో పాటు బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ చేసిన ఘటనలో ముగ్గురు నిందితులు వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు అరెస్ట్ అయ్యారు. వీరు చక్రధర్ గౌడ్కు బెదిరింపు కాల్స్, మెసేజ్లు పంపుతూ డబ్బులు…
Car Racing: హైదరాబాద్ నగరంలో మరోసారి కార్ రేసర్లు రెచ్చిపోయారు. శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున కొంతమంది యువకులు కార్లతో రేసింగ్లు, స్టంట్లు చేయడం ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ యువకులు ఓఆర్ఆర్పై వేగంగా కార్లు నడిపించి, ఆపై ఒక్కసారిగా వాటిని ఆపి గింగిరాలు తిప్పారు. ఇలా ఉన్నచోటే కార్లను పలుమార్లు రౌండ్గా తిప్పుతూ హంగామా సృష్టించారు. ఈ కార్ రేసింగ్ కారణంగా ఓఆర్ఆర్పై ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులకు…
Hyderabad: హైదరాబాద్లోని పంజాగుట్టలో పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర్ హత్య ఘటన నగరాన్ని తీవ్ర కుదిపేసింది. కుటుంబ ఆస్తుల కోసం జరిగిన ఈ హత్యలో చంద్రశేఖర్ సొంత మనవడు కీర్తి తేజ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. 73 సార్లు కత్తితో పొడిచి తన తాతను హతమార్చిన కీర్తి తేజ, తండ్రి లేని కుటుంబంలో తాత ఇతర మనవళ్లను చూసినట్లుగా తనను చూడలేదని భావించి ఈ హత్యకు పాల్పిడినట్లు తెలుస్తోంది. వెలమాటి చంద్రశేఖర్ తన కంపెనీలో ఇటీవల ఒక…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం సమీపంలో జరిగిన వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర కలకలం సృష్టించాయి.. అయితే, అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.