Mallika Sherawat: ‘టామ్ క్రూజ్‌కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallika Sherawat: కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మైండ్-గేమ్ రియాలిటీ షో ‘ది ట్రేటర్స్’ సీజన్ 2′ 2026 ఆగస్టు 13 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది. జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్ నేపథ్యంలో సాగే ఈ వ్యూహాత్మక ఆటలో మునావర్ ఫారూఖీ, అభిషేక్ మల్హన్, మల్లికా షెరావత్, రియా చక్రవర్తి, శ్వేతా తివారీ వంటి 21 మంది ప్రముఖ సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. ఇందులో ‘ట్రేటర్స్’ (ద్రోహులు) ‘ఇన్నోసెంట్స్’ (అమాయకులు) మధ్య జరిగే మానసిక పోరాటం, మోసాలు, ఎలిమినేషన్ల చుట్టూ షో ఉత్కంఠభరితంగా సాగనుంది.
అయితే ఈ రియాలిటీ షోలో భాగంగా మల్లికా షెరావత్ చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షోలో హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్‌కు తనపై క్రష్ ఉందని ఆమె చెప్పడంతో ‘ది ట్రేటర్స్’ సీజన్ 2లోని ఇతర కంటెస్టెంట్లు మాత్రమే కాదు, షో క్లిప్ చూసిన నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయారు. అయితే మల్లిక చెప్పిన విషయం నిజమేనా, ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి అనే చర్చ మొదలైంది. ‘ది ట్రేటర్స్ 2’లో భాగమైన హాస్యనటుడు ఆదిత్య కులశ్రేష్ఠ, మల్లికను ఎప్పుడైనా తనకు ఎవరిపైనైనా ఇష్టం కలిగిందా అని అడిగారు. అందుకు ఆమె తనకు ఎవరిపైనా క్రష్ లేదని, అందరికీ తనపైనే ఇష్టం ఉంటుందని సరదాగా సమాధానమిచ్చారు. ఆ వెంటనే టామ్ క్రూజ్‌కు ఇటీవల తనపై క్రష్ కలిగిందని చెప్పడంతో అక్కడున్న కంటెస్టెంట్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
Also Read
- Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
- Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
- Ramayana: సరిహద్దులు దాటిన రాముడి క్రేజ్.. కరాచీ టెంపుల్లో ‘రామాయణ’ సంబరాలు!
- Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
అయితే మల్లిక అక్కడితో ఆగలేదు. తాను అబద్ధం చెప్పడం లేదని, తన వద్ద ఫోన్ ఉంటే టామ్ క్రూజ్‌తో కలిసి ఉన్న వీడియోను చూపించేదానినని ఆమె పేర్కొన్నారు. ఆ వీడియోలో తామిద్దరూ కలిసి పార్టీ చేసుకుంటున్నట్లు కనిపిస్తుందని వివరించారు. టామ్ క్రూజ్ చాలా గొప్ప వ్యక్తి అని కూడా ఆమె చెప్పడంతో అక్కడి సంభాషణ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ మొత్తం సన్నివేశానికి సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో భిన్నమైన స్పందనలు కనిపించాయి. అయితే మల్లిక వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు ఆమె చెప్పింది నమ్మలేమని, ఇది పూర్తిగా కల్పిత కథలా ఉందని కామెంట్లు చేశారు. మరికొందరు మాత్రం ఆమె వ్యాఖ్యలను సరదాగా తీసుకున్నారు. అయితే వైరల్ అవుతున్న క్లిప్‌లో మల్లిక తన మాటలను చాలా నమ్మకంగా చెప్పడం మాత్రం ఈ చర్చకు మరింత ఊపు ఇచ్చింది. మొత్తానికి, ‘ది ట్రేటర్స్ 2’లో మల్లికా షెరావత్ ప్రవేశం ఇప్పటికే ఆసక్తిని పెంచగా, టామ్ క్రూజ్‌కు తనపై క్రష్ ఉందంటూ ఆమె చేసిన వ్యాఖ్య ఆ హైప్‌ను మరింత పెంచింది. ఆమె చెబుతున్నది నిజమా, అబద్ధమా అన్నది అటుంచితే, ఆమె మాటలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Tags
- cinema
- Mallika Sherawat
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?