Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు అటవీ ప్రాంతంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అడవి జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చులో చిక్కుకుని ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అటవీ ప్రాంతంలో కొంతమంది వేటగాళ్లు వైర్లు అమర్చి అడవి జంతువుల కోసం ఉచ్చులు ఏర్పాటు చేశారనే సమాచారం ఫారెస్ట్ కార్యాలయానికి రావడంతో, ఆరుగురు సిబ్బంది కలసి అటవీ ప్రాంతంలోకి తనిఖీల కోసం నడుచుకుంటూ వెళ్లారు. బూర్గంపాడు మండలం నకిరేపేట అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, వేటగాళ్లు అమర్చిన కరెంట్ తీగలు ప్రమాదవశాత్తు తగలడంతో పాల్వంచ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని చెరువు సింగారం బీట్‌లో పనిచేస్తున్న FBO బానోత్ నవీన్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన నవీన్ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకట తండాకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. విధి నిర్వహణలో ఉన్న అధికారి కరెంట్ ఉచ్చులకు బలవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
-
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
-
Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..