Hitech Thief: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ ఉదంతం మరో మలుపు తిరిగింది. రాజమండ్రి సమీపంలో పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయిన ప్రభాకర్ ఆచూకీని ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను చెన్నై సమీపంలో ఉన్నట్లు సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు నిర్ధారించుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ‘ప్రిజం’ పబ్బులో కాల్పులు జరిపి హల్చల్ సృష్టించడంతో ప్రభాకర్ పేరు మొదటిసారి వెలుగులోకి వచ్చింది. అప్పటి నుండి అతను పోలీసులకు సవాల్‌గా మారుతూనే ఉన్నాడు. ప్రభాకర్ స్టైల్ చాలా విభిన్నం.
కేవలం ఇళ్లను మాత్రమే కాకుండా, ఏపీ, తెలంగాణలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలను లక్ష్యంగా చేసుకుని భారీ దోపిడీలకు పాల్పడటం ఇతని ప్రత్యేకత. కాలేజీల్లోని ఆఫీస్ లాకర్లను కొల్లగొట్టడంలో ఇతను సిద్ధహస్తుడు. విజయవాడ నుంచి తప్పించుకున్న ప్రభాకర్, పోలీసుల కళ్లు గప్పి చెన్నైకి మకాం మార్చాడు. అక్కడ కూడా తన పంథా మార్చుకోకుండా, తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో భారీ చోరీకి పాల్పడ్డాడు. ఆ కాలేజీ లాకర్ల నుంచి సుమారు 60 లక్షల రూపాయల నగదును దొంగిలించినట్లు సమాచారం.
Tollywood Primier League: దిల్ రాజు అండతో వంశీ చాగంటి ‘బిగ్ ప్లాన్’
దొంగిలించిన సొమ్ముతో ప్రభాకర్ చెన్నైలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఖరీదైన హోటళ్లు, విలాసాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు గుర్తించారు. చెన్నై కాలేజీలో జరిగిన దొంగతనానికి సంబంధించిన సీసీటీవీ (CCTV) ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న వ్యక్తి బత్తుల ప్రభాకరేనని నిర్ధారించుకున్న పోలీసులు, అతని కదలికలపై నిఘా ఉంచారు. ఏపీ మరియు తెలంగాణ పోలీసులు సంయుక్తంగా తమిళనాడు పోలీసుల సహకారంతో అతని కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. త్వరలోనే ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకుని తెలుగు రాష్ట్రాలకు తీసుకువచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Kandula Durgesh: కొత్త సినిమాల టికెట్ల రేట్ల పెంపుపై మంత్రి కందుల దర్గేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..