Accident : అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లె వద్ద ఓ లారీ బోల్తా పడిన ఘటనలో ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో లారీలో మొత్తం 15 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. వివరాల్లోకి వెళితే… కడప జిల్లా రైల్వేకోడూరు పరిధికి చెందిన కూలీలు, మామిడికాయలు కోసేందుకు రెడ్డిపల్లె ప్రాంతానికి వచ్చారు. పనులు పూర్తయ్యాక కోసిన కాయలను లారీలో లోడ్ చేసి తిరిగి బయలుదేరారు. అయితే చెరువు కట్ట వద్దకు రాగానే లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. లారీ కింద ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
Kidnap : హనుమకొండలో బాలుడి కిడ్నాప్.. 12 లక్షలు డిమాండ్.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. తర్వాతి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణమే ప్రమాదానికి దారితీసిందా లేక ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో రెడ్డిపల్లె ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలకు స్థానికులు సానుభూతి తెలిపారు. ప్రభుత్వం పర్యవేక్షణలో ఉన్నతాధికారులు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Sonia Gandhi: 15న సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ కీలక భేటీ.. దేనికోసమంటే..!