Gadwal Murder : జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు మలుపు తిరిగింది. ఈ కేసు మొదట కనిపించినంత సాధారణం కాకుండా, దాని వెనుక ఉన్న కథనం ఆవిష్కరించబడుతున్న కొద్దీ నోరెళ్లబెట్టే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 32 ఏళ్ల తేజేశ్వర్‌కు కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. కానీ పెళ్లికి కేవలం ఐదు రోజులు ముందు ఐశ్వర్య అనూహ్యంగా అదృశ్యమైంది. ఆమె కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకు ఉద్యోగితో…
Viral : బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో జరిగిన ఘటన అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ భర్త, భార్యతో పిల్లల ఎదుటే తీవ్రంగా గొడవ పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారు ఎంతగా గొడవ పడుతున్నా, ఇద్దరికీ పిల్లల మనస్తత్వం మీద పడే ప్రభావం గురించి ఆలోచన కూడా లేకపోవడం బాధాకరం. వీడియోలో భర్త కోపంగా భార్యను చెంపదెబ్బలు కొడుతూ కనిపిస్తాడు. అంతటితో ఆగకుండా ఆమె గొంతు పట్టుకుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న…
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైంది. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని మధ్యాహ్నం గమనించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. నాలుగు అడుగుల నీటి సంపులో మృతదేహం లభ్యమైంది. స్థానికులు, బంధువులు కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
డబుల్ బెడ్రూమ్ ఇల్లు.. జస్ట్ 2 లక్షల రూపాయలు మాత్రమే..!! ఈ ఆఫర్ మీకు కూడా టెంప్టింగ్గా అనిపిస్తోంది కదూ..!! అవును మరి అలాంటిదే బంపర్ ఆఫర్..!! ఇలా నమ్మించే దాదాపు 100 మందిని బురిడీ కొట్టించారు నలుగురు కేటుగాళ్లు. ఏకంగా కోటి రూపాయలు కొట్టేసి నకిలీ పట్టాలు చేతిలో పెట్టారు. పోలీసులు పట్టుకోవడంతో ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నారు. సొంత ఇల్లు ఎవరికైనా ఓ కల. సొంత ఇల్లు ఉండాలి.. ఇది ఎవరికైనా ఓ కల..డబుల్ బెడ్రూమ్…
కొమురం భీం జిల్లాలో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టైంది. అదృశ్యమైన యువతి ఆధార్ కార్డు ఏడాది తర్వాత ఇంటికి రావడంతో పోలీసులను ఆశ్రయిస్తే కేసు కూపీలాగారు. ఆ యువతి విషయం వెలుగులోకి రావడంతోనే మరో యువతి ని సైతం విక్రయించినట్లు తేలింది. 9 మంది ఓ ముఠాగా ఏర్పడి యువతులు, ఒంటరి మహిళలే టార్గెట్‌గా అక్రమ రవాణాకు తెరలేపారు. ఆధార్ కార్డు కాస్త క్లూ ఇవ్వడంతో మొత్తం కేసును లాగారు పోలీసులు. ఇద్దరినే అమ్మేశారా?…
కన్నపిల్లలను వద్దనుకొని ప్రియుడి మోజులో పడి ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఓ కుమార్తె తీరు నలుగురి ప్రాణాలు తీసింది. కన్నబిడ్డ ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో అవమానంగా భావించిన ఆ తల్లి… తన కన్నతల్లికి చెప్పుకొని ఆవేదన చెందింది. ఇంత పరువు పోయాక ఇక బతకడం దేనికి అనుకొని ఆ తల్లి, అమ్మమ్మ ఇద్దరు మనవరాళ్లను చంపి ఆపైన తాము కూడా ఉరేసుకొన్న విషాద ఘటన తమిళనాడులోని దిండుక్కల్ జిల్లాలో జరిగింది. వివాహేతర సంబంధం నలుగురి ప్రాణాలు తీసింది……
రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రేమికుడు తన ప్రియురాలిని చంపి భూమిలో పాతిపెట్టాడు. 5 రోజులుగా కనిపించకుండా పోయిన ప్రియురాలి మృతదేహం ప్రియుడి ఇంటికి కొద్ది దూరంలో లభించింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడిని పట్టుకోవడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ యువకుడు సోషల్ మీడియాలో ఓ అమ్మాయితో స్నేహం చేశాడు. తాను హిందువు అని చెప్పుకున్నాడు. కానీ ఆ అమ్మాయి ఆ అబ్బాయి మతం, నిజస్వరూపం గురించి తెలుసుకుంది. ఈ విషయం బయటకు చెబితే.. ఆమెను, ఆమె కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు.
అతను ఎం.టెక్ వరకు చదివాడు. ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. కానీ చెడు వ్యక్తులతో స్నేహం చేసి జూదానికి బానిసయ్యాడు. ఆపై దొంగతనం చేసి ఇప్పుడు జైలుకు వెళ్లాడు. నాగ్‌పూర్‌లోని ధంతోలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నాగ్‌పూర్‌లోని ధంతోలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో శీతల్ చింతల్వార్ ఇంట్లో దొంగతనం జరిగింది.