హైదరాబాద్‌లోని మలక్‌పేటలో జరిగిన కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా చందు నాయక్‌పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడికక్కడే చందు నాయక్ ప్రాణాలు వదిలారు. ఇక చందు నాయక్‌పై కాల్పులు జరిపి నలుగురు నిందితులు పారిపోయారు. చందును హతమార్చేందుకు రెండు రోజుల నుంచి రాజేశ్ అండ్ టీమ్ రెక్కీ నిర్వహించింది. ప్రస్తుతం రాజేశ్, శివ, మున్నా, భాషాలు పరారీలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Fauja Singh: కారు ఢీకొని ప్రముఖ అథ్లెట్ ఫౌజా సింగ్ మృతి.. నిందితుడు ఎన్నారై అరెస్ట్
నలుగురు నిందితులు కూడా మొబైల్ ఫోన్‌లు స్విచ్ఛాఫ్ చేసి ఉన్నాయి. చందుపై కాల్పులకు పాల్పడిన వారిలో రాజేశ్ ఉన్నట్లు భార్య, కుమార్తె గుర్తించారు. ఇంటి దగ్గర రాజేశ్‌ను చూసి చందుకి భార్య సమాచారం అందించింది. నలుగురు నిందితులు మొత్తం ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇక హత్య కోసం వినియోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే చందు హత్యలో మొత్తం తొమ్మిది మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం జల్లెడ పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Ukraine: ఉక్రెయిన్ ప్రధాని రాజీనామా.. కొత్త ప్రధానిగా జెలెన్‌స్కీ స్నేహితురాలు
రాజేశ్‌తో పాటు ప్రశాంత్, ఏడుకొండలు, సుధాకర్, మున్నా, రాయుడు, రవీంద్రా చారి, యాదిరెడ్డిలు నిందితులుగా ఉన్నట్లు ఎఫ్ఐఆర్ కాపీలో పోలీసులు పేర్కొన్నారు. హత్యలో నేరుగా పాల్గొనది మాత్రం నలుగురు అని.. వారికి సహకరించింది మరో ఐదుగురు అని పోలీసులు తేల్చారు. తొమ్మిది మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులు కోసం ప్రత్యేకంగా పది టీమ్‌ల ఏర్పాటు చేశారు. అయితే ఈ హత్యలో గుడిసెల వివాదంతో పాటు వివాహేతర సంబంధం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.