Tragic : యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ హత్య ఘటన వెలుగు చూసింది. మొదట్లో రోడ్డు ప్రమాదంగా అనుమానించిన కేసు.. చివరకు ప్రేమ వ్యవహారంతో జరిగిన హత్యగా తేలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
ఈ రోజు ఉదయం యాదాద్రి కాటేపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఒక ద్విచక్ర వాహనాన్ని కార్ ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని స్వామిగా పోలీసులు గుర్తించారు. తొలుత ఇది యాదృచ్ఛిక రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు, సంఘటన స్థలాన్ని పరిశీలిస్తూ కేసును నమోదు చేశారు.
అయితే, విచారణలో అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయి. కార్ నంబర్ ఆధారంగా పోలీసులు విచారణను ముమ్మరం చేయగా, ఇది యాదృచ్ఛిక ప్రమాదం కాదని, కావాలనే కారుతో బైక్‌ను ఢీ కొట్టి హత్యచేశారు అనే తేలింది.
AP and Telangana Water War: ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ.. ఎల్లుండి సీఎంల భేటీ..
మరింత లోతుగా విచారించగా, హత్యకు ప్రధాన కారణంగా మృతుడు స్వామి భార్య ప్రేమ సంబంధం ఉన్నట్లు సమాచారం. తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ఆమె పథకం వేసినట్లు పోలీసులు వెల్లడించారు. కారును రెంటుకు తీసుకుని, తన భర్త బైక్‌పై వెళ్తున్న సమయంలో ఢీ కొట్టి హత్య చేశారు.
స్వామి భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా, ఆమె ఒప్పుకున్నట్లు సమాచారం. అంతేకాక, ఈ హత్యలో బామ్మర్ది ప్రమేయం కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు సుపారీ కిల్లర్లను కూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రేమ వ్యవహారంలో భర్తను పొట్టన పెట్టుకునేంతకూ హత్య పథకం రచించిన ఈ దారుణం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
Mumbai Airport: తప్పిన పెను ప్రమాదం.. విమానాన్ని ఢీ కొట్టిన కార్గో వాహనం..!