HMDA: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) సమీపంలోని బాచుపల్లి లేఅవుట్ లో ప్లాట్లను కొనుగోలు చేసే అంశంపై ప్రజలను పక్కదారి పట్టిస్తున్న ఒక సంస్థ సీఈఓ పై హెచ్ఎండీఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు పై బాచుపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
గత రెండురోజులుగా ఇండస్ట్రీలో కరాటే కళ్యాణి గురించిన వివాదం హాట్ టాపిక్ గా మారిన విషయం విదితమే. ప్రముఖ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పై ఆమె దాడి చేయడం, తనను డబ్బులు ఇవ్వమని బలవంతపెడుతుందని శ్రీకాంత్ ఆమెపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయమూ విదితమే. ఇక శ్రీకాంత్ ఫిర్యాదుతో కరాటే కళ్యాణి బాధితులు క్యూ కట్టారు. తాము కూడా కరాటే కళ్యాణి…
కామాతురాణాం నభయం నలజ్జ అంటారు. కామంతో కళ్ళు మూసుకుపోయినవాడికి భయం వుండదు.. సిగ్గుశరం వుండవు. విజయవాడలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న అమ్మాయిపై అఘాయిత్యానికి ప్రయత్నించారు కొందరు ఆకతాయిలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన అందరినీ కలవరానికి గురిచేసింది. విజయవాడ అరండల్ పేట లోని మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఉర్దూ స్కూల్ ప్రాంగణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్కూల్ ఆవరణలో ఎటు చూసినా మద్యం బాటిళ్లు కనిపించాయి. ఈ ఘటనతో పాఠశాలలకు…
సాధారణంగా పిల్లలు వారి స్నేహితులు కొడితే తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తారు. అదే టీచర్లు కొడితే పశ్చాతాపం వ్యక్తం చేస్తారు. అయితే ఇప్పుడు కాలం మారిపోయింది. స్కూళ్లలో పిల్లలపై టీచర్ల దెబ్బపడితే అటు తల్లిదండ్రులు ఊరుకోవడం లేదు.. ఇటు పిల్లలు కూడా మాట వినడం లేదు. కానీ ఏకంగా టీచర్లపై ఓ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్లపై ఏడేళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు…
మంచు మోహన్బాబు కుటుంబసభ్యులపై కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఏపీలో సినిమా టిక్కెట్ ధరల అంశం, సన్నాఫ్ ఇండియా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్, కలెక్షన్లు.. ఇలా ప్రతి అంశం సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచు విష్ణుకు చెందిన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తరఫున హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు శేషు కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. మంచు ఫ్యామిలీపై వస్తున్న ట్రోల్స్ను తక్షణమే తొలగించకపోతే చర్యలు…